సాంబుడు
జాంబవతీ కృష్ణుల కుమారుడు సాంబుడు, దుర్యోధనుడు తన కుమార్తెకు
స్వయంవరము చాటించెను. సామ్బుడా స్వయంవరమునకు వెళ్లి, దుర్యోధనుని కుమార్తెను ఎత్తుకొని వచ్చెను. దారిలోనే
భీష్మద్రోణాదులతో దుర్యోధను డడ్డగించి సాంబుని ఓడించి బంధించెను. ఈ సంగతి కృష్ణ
బలరాములకు తెలిసినది. "అనవసర విరోధము కౌరవులతో మనకు ఎందుకు? నేనువెళ్లి సాంబుని సామోపాయమున
విడిపించుకొని వచ్చెదను" అనుచు బలరాముడు
బయలుదేరి హస్తినాపురము బయట ఉద్యానవనములో బసచేసేను. బలరాముడు వచ్చినాడని
విని పరివారముతో దుర్యోధనుడు స్వాగతసత్కారము లిచ్చుటకై ఎదురు వెళ్ళెను. దానికి
బలరాముడు సంతోషించి వారితో నిట్లనెను. "నేను ఉగ్రసేనుని ప్రతినిధిగా
వచ్చినాను. మా సాంబుని మీరు బంధించినారట కదా! వానిని విదిచిపెట్టవలసినదని మా
ఉగ్రసేన మహారాజు ఆజ్ఞాపించుచున్నాడు. కావున వెంటనే వానిని
విడిచిపెట్టుడు".
బలరాముని మాటలు వినగానే దుర్యోధన, దుశ్శాశన, కర్ణాదులకే కాక, భీష్మద్రోణాదులకు కూడా కోపము వచ్చినది. వారు బలరామునితో
"ఏమయ్యా! అన్నియు తెలిసి యిట్లు మాటలాడుచున్నావు. ఇదేమి? కురువంశమున బుట్టిన చక్రవర్తులను
ఒక యాదవుడు ఆజ్ఞాపించుట యేమి? యాదవులకు అసలు రాజ్యాధికారము
వహించు అర్హతలేదు. వారు ల్మమ్ము ఆజ్ఞాపించుటయా? వారి యాజ్ఞలకు తలయోగ్గినచో మే మీ
రాజలాంచనములను ధరించుట హాస్యాస్పదము గదా!
మర్యాదలు తెలియని మీరు మాటాడినను మేము అంగీకరించము. మీ రాజు అజ్ఞాపించినను, నీ వాజ్ఞాపించినను మేము లెక్కచేయువారము కాము. అక్రమముగా
ప్రవర్తించిన, సాంబుని వాడలేదు ప్రస్తావనయేమి లేదు. మీరు
మాట్లాడినది చూడగా రాజును ఒక సేవకుడు ఆజ్ఞాపించునట్లు ఉన్నది. మీ
యాదవులందరు మా ఆజ్ఞను పాలింపవలసినవారే గదా! మేము మీకు, మాతో సమానముగా పీటలువేసి, భోజనాలు పెట్టి మర్యాదలు చేసినందువలననే గర్వించి యిట్లు
మాటలాడుచున్నారు. ఇది మీతప్పుగాదు. మంచిచరిత్ర లేని మిమ్ము ఇంతవరకును
గౌరవించుట మా మంచితనమునకు నిదర్శనము. ఇంక మీ సాంబుని విడిచిపెట్టుట
జరగదు" అని కటినముగా సమాధానమిచ్చి, దుర్యోధనాదులు పురములోనికి బోయిరి.
No comments:
Post a Comment