నవగ్రహములు - రత్నములు
సూర్యాది నవగ్రహములకును తొమ్మిది విధములైన రత్నములు నిర్దేశింప బడినవి .ఆకాశములో నున్న ఈ గ్రహముల కాంతులు సరిగా మనపై ప్రసరింపక పోవచ్చును. ఆ కాంతులు మన శరీరముపై బడినచో అనేక అనారోగ్యములు తొలగుటయే కాక ,ఆయా గ్రహములు విషమ స్థానములందున్నచో సత్ఫలితములను ,మంచి స్థానము లందున్నచో విశేష ఫలములను కలిగించును. అందుచేత నవరత్నముల ఉంగరములను ధరించుట నవగ్రహ ప్రీతి కొరకే అని గ్రహింప వలెను. ఆయా గ్రహములకు చెప్పబడిన రత్నములు క్రింద నీయబడు చున్నవి .
1 .సూర్యుడు -- పద్మరాగము (కెంపు)
2 . చంద్రుడు -- ముత్యము
3 .అంగారకుడు - పగడము
4 .బుధుడు -- ఆకుపచ్చ
5 .గురుడు --పుష్యరాగము (గరుడ పచ్చ )
6 .శుక్రుడు --వజ్రము
7 .శని -- నీలము (ఇంద్ర నీలము )
8 .రాహువు - గోమేధికము
9 . కేతువు -- వైడూర్యము
పంచ మహా యజ్ఞములు
"యజ ఆరాధనే ", అను ధాతువు నుండి పుట్టినది యజ్ఞ శబ్దము పృధ్విలో పుట్టిన ప్రతి మానవుడు ను ప్రతి దినమును ఈ యజ్ఞములు ఆచరించ వలెను. ఈ యజ్ఞములు ఐదు .1 . దేవ యజ్ఞము 2 . పిత్రు యజ్ఞము 3 . భూత యజ్ఞము 4 . మనుష్య యజ్ఞము 5 . బ్రహ్మ యజ్ఞము .
1 .దేవ యజ్ఞము : దీనినే వైశ్వ దేవ మందురు . గృహస్థులు గార్హ పత్యాగ్నిలో దేవతల నుద్దేశించి చేయుదురు. బ్రహ్మ చారులైనచో లౌకికమైన అగ్ని లేనే అగ్ని కార్యము చేయుదురు .(గృహస్థులు చేయునది మాత్రమే వైశ్వ దేవము ) శూద్రులకు నమస్కారమే దేవ యజ్ఞ ఫలము నిచ్చును.
No comments:
Post a Comment