విష్ణువును వృద్ద విప్రుని వేషమును దధిచి వద్దకు వచ్చెను. దధిచి అతనిని విష్ణువుగా గుర్తించి, " బ్రాహ్మణుని సాధించుటకు కపట వేషము ధరింపవలెనా? మనస్సులో శివుని నిలుపుకొన్న నన్ను పరాభ వింపగల వాడెవడున్నాడు? నేనెవ్వరికిని భయపడవలసిన పనిలే "దనెను. శ్రీపతి," అదే గర్వముతోనే సభలో నా భక్తుని పరాభవించినావు. నిన్ను క్షమించను" అనుచు చక్రము నాతని పై ప్రయోగించెను. చక్ర మాతని శరీరమునకు తగిలి మొక్కవోయి క్రింద పడెను. అది చూచి దధిచి, " మాధవా! రాక్షసులను సంహరించుటకై శివుడు నీ కిచ్చిన చక్రము నిట్లు వ్యర్ధము చేసితివి. ఇంకేమి అస్త్రము లున్నవో చూచి నాపై ప్రయోగింపు" మనెను. కేశవుడు కోపించి అనేకా స్త్రములు ప్రయోగించెను. ఇంద్రాదులతనికి తోడువచ్చి అనేకాస్త్రములు ప్రయోగించిరి. దధిచి ఒక దర్భను చేత బట్టి నిలిచెను. అస్త్రము లన్నియు దానిలో లీనమయ్యెను.
విష్ణువు ఇది పనిగాదని విశ్వరూపము చూజపి భయపెట్ట బోయెను. దధిచి, " నీవంటి తాంత్రికులు జగములో ఇంకెవ్వరున్నారు? ఒక్క బడుగు బాపని సాధించుటకు నీ వింత భయంకరుడవు కావలేనా? ఇంత మాత్రము చేత నేను భయపడుదు ననుకొన్నావా? ఇదిగో చూడుము" అని ధ్యాన నిమగ్నుడయ్యెను. అతని శరీరములో సకల బ్రహ్మాండములు, విష్ణువు, ఇంద్రాది దేవతలు, రాక్షసులు, మనుష్యులు, పర్వతాలు, సముద్రాలు సర్వ విశ్వమును ప్రత్యక్ష మయ్యెను. అది చూచి బ్రహ్మాది దేవతలే ఆశ్చర్యపడిరి. విష్ణు వింక చేయునది లేక దధిచిని స్తుతించి వెడ లిపోయెను. క్షుపుడు దధిచి కాళ్ళమీద పడి క్షమింపు మనుచు, పూర్వమువలెనే మంత్రిత్వము చేయుమని ప్రార్ధింపగా, బ్రహ్మ కూడ వచ్చి నచ్చజెప్పెను. దధిచి, శివుని ధ్యానించి, వారితో, మన్ముందు దక్షుడనువాడు శివుని బిలువక యజ్ఞము సేయును. అప్పుడు శ్రీనాధుడు మున్నగు దేవత లందరును పరాభవము నొందుదురు.దానికి సంఖటనమే సూచన. ఆ యాపద తొలగెడి మార్గము చూచుకొను" డని చెప్పి మునీంద్రుడు తపము చేసి కొనబోయెను.
No comments:
Post a Comment