Saturday, August 17, 2013

బ్రహ్మపురాణము29



పౌండ్రక వాసుదేవుడు
పుండ్ర దేశమున కధిపతిగాఫ వాసుదేవుడు అను పేరుగల ఒక రాజుండెను. అతడును రాక్షసాంశతో జనించిన వాడే. వాడు శ్రీకృష్ణుని కడకు ఒకనాడు దూతను పంపెను. వాడు శ్రీకృష్ణునితో, తమ రాజుమాటలుగా ఇట్లు పలికెను. " వాసుదేవా! నీవు నాపేరు పెట్టుకొని నావలెనే పీతాంబరమును గట్టి, శంఖచాక్రాదులైన ఆయుధములను నాలాగుననే ధరించి విర్రవీగు చున్నావట. వాటినన్నిటిని వెంటనే విడిచిపెట్టి, తప్పయినది క్షమింపుమని నాశరణు కోరుము. నిన్ను విడిచి పెట్టెదను".

ఈ మాటలువిని కృష్ణుడు కోపము పట్టలేక "అట్లే యుద్ధమునకు వచ్చి అక్కడ ఇవన్నియు విడిచెదనని చెప్పుము" అని వానిని బంపి గరుడు నెక్కి యుద్ధమునకు వెళ్ళెను. వాడును శ్రీకృష్ణుని వలెనే వేషము వేసుకొని వచ్చెను. వానిని జూచి కృష్ణుడు నవ్వి, "ఇదిగో, నీ వన్నట్లే ఆయుధములను విడుచుచున్నాను" అని,  "ఈ ఆయుధములు వీనిని చావమొత్తి వచ్చుగాకా" అనుచు విడిచెను. ఆ యాయుధములన్నియు వెళ్లి పౌండ్రకవాసుదేవుని చితక బొడిచెను. ఇంక నిలుచుండుటకు కూడా శక్తి లేక వాడు నిలబడి చచ్చెను. వానికి సాయము చేయవచ్చిన కాశిరాజును గూడ ససైన్యముగా వధించి భూభారమును దొలగించి వాసుదేవుడు ద్వారకకు జేరెను.

ధర్మాత్ములైన పాండవుల పక్షమున నుండి కౌరవులతో యుద్ధము చేయించి దురాచారులైన కౌరవులను హతమార్చెను. ముని శాపము వలన సాంబుని కడుపున ముసలము పుట్టెను. దానిని అరుగదీసి సముద్రములో కలుపగా అది తుంగగా మొలిచెను. యాదవులందరు విహారమునకు బోయి ఆకారణముగా తమోలో తాము కలిహించుకొని ఆ తుంగకాడలతో బాదుకొని చచ్చిరి. బలరాముని నోటినుండి ఆదిశేషుడు వెడలిపోయెను. శ్రీకృష్ణుని పాదమును బాణముతో ఒక బోయవాడు కొట్టెను. అది కారణముగా శ్రీకృష్ణుడు పరంధామమును జేరెను. శ్రీకృష్ణ పత్నులు అగ్నిలో దుమికిరి.


First   20  21  22  23  24 25 26 27 28 29 30 Last

No comments:

Post a Comment