Friday, August 2, 2013

శ్రీ అగ్ని పురాణము1




ఈ అగ్ని పురాణమును గూర్చియు, దీని విశిష్టతను గురించియు ఇదే పురాణములో 271 వ అధ్యాయములో ఇట్లు వివరింపబడినది.

శ్లో|| అగ్ని రూపేణ దేవాదే ర్మఖం విష్ణు: పరాగతి:
అగ్నేయస్య పురాణస్య వక్తా శ్రోతా జనార్దనః
తస్మా త్పురాణ మాగ్నేయం సర్వవేద మయం జగత్
సర్వవిద్యామయం పుణ్యం సర్వజ్ఞాన మయం పరం
సర్వాత్మ హరి రూపం హాయ్ పటతాం శ్రున్వతాం నృణాం
విద్యార్ధి నాం చ విద్యాదం అర్దినాం శ్రీధన ప్రదం
సర్వేప్సూనాం సర్వదంతు ముక్తిదం ముక్తి కామినాం
పాపఘ్నం పాపకర్త్రూణా మాగ్నేయం హి పురాణకమ్.

అనగా శ్రీమహావిష్ణువు అగ్ని రూపముతో దేవదానవ మానవాదులకు ముఖస్థానీ యుడై పోషణ చేయుచున్నాడు. అందుచే అగ్నిచే చెప్పబడిన ఈ పురాణమును చెప్పువాడును, వినువాడును గూడ జనార్దనుడే. ఆ హేతువు చేత ఈ పురాణము సమస్తమైన వేదమయ జగత్తుగా గ్రహించవలెను. సర్వవిద్యలు, సర్వవిష్య జ్ఞానము, దీనివలన పొందవచ్చును. సర్వాత్ముడైన శ్రీహరి విశ్వరూపము దీనిలో చూడవచ్చును. విద్యార్ధులకు విద్యలును, కోరినవానికి, ధనాది సంపదలు, ముక్తిని, గోరువారికి ముక్తిని, అన్నింటిని గోరువారి అన్నింటిని ఇచ్చి  ఇచ్చి సర్వపాపములను బోగొట్టి, మహాపున్యము నిచ్చును అని యర్ధము. ఈ పురాణమొక విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. లౌకికాలౌకిక విషయము లెన్నో దీనిలో వివరింపబడినవి. ఈ పురాణము ఒక మంత్రశాస్త్ర మని కూడా చెప్పుచుందురు.  

వసిష్ఠ మహాముని అగ్నిదేవుడు వినిపించిన పురాణమును, నైమిశారణ్యమున సూతుడు శౌనకాది మునులకు వినిపించెను. అగ్నిదేవుడు చెప్పిన పురాణము గావున అగ్ని (ఆగ్నేయ) పురాణమని ప్రసిద్ధి కెక్కెను.

మహాభారత కథ ఔ

" శ్రీ కృష్ణుడు భారత యుద్ధములో పాండవుల పక్షమున నిలిచినాడని చెప్పితివి గదా, అగ్నిదేవా! ఆ పాండవులెవరు? వారి కథను వినిపింపు" మనగా అగ్ని దేవుడు వశిష్టున కిట్లు చెప్పెను.


First  2  3  4  5  6  7  8  9  10  11  Last

No comments:

Post a Comment