Sunday, August 18, 2013

బ్రహ్మపురాణము19




రాబోవు ఆషాడ శుద్ధపంచమినాడు మాఘానక్షత్రమునందు  నన్ను అక్కడ ప్రతిష్టించి ఏడురోజులు పూజాపురస్కారములు చేయుము" అని చెప్పగా విని రాజు మహాసంతోషమునుబొంది, ఈ చర్మ చక్షువులతోనే నేను జగన్నాథుని దర్శించినాను. ఇంతకంటే మరేమీ కావలెనని భావించుచు, సుభద్రా బలరామ కృష్ణ విగ్రహములను పల్లకీలలో బ్ర్ట్టిమ్చి దేవాలయమునకు తీసుకొని వెళ్ళెను.
భగవానుడు చెప్పిన సుముహూర్త సమయమున, ఆగమశాస్త్ర విదానముగా ఋత్విక్కుల వేదమంత్రములతో విగ్రహములను ప్రతిష్టించి కళాన్యాసము చేయించెను. ఆ విగ్రహ ప్రతిను యథాశాస్త్రముగా నడిపించిన బ్రహ్మకును, (గురువుగారికి) ఋత్విక్కులకును బంగారము, రత్నములు, ముత్యములు, దక్షిణలుగా నిచ్చి వస్త్రాభరణములతో పూజించెను.

శుద్ధ ద్వాదశి తిథి గల రోజున శ్రీజగన్నాథుని దర్శించిన భక్తునికి, డెబ్బదివేల సంవత్సరములు ఒంటికాలిమీద నిలిచి ఏకాగ్రతతో చేసిన ఫలము లభించును. జ్యేష్ట మాసమున పంచతీర్ధ యాత్ర చేసి జగన్నాథుని దర్శించిన వారికి విష్ణులోకములు లభించును. శుక్లపక్షమున యాత్ర చేయుటకు వీలులేనిచో కృష్ణపక్షము నందైనను చేయవచ్చును.

ఇంద్రద్యుమ్న తీర్ధములో స్నానమాడిన వానికి స్వర్గాది పుణ్యలోకములు గలుగును. ఈ సరస్సు ఒడ్డున ఎవడైనా పితరులను ఉద్దేశించి పిండప్రదానము చేసినచో వాని పితరులు తరించెదరు. పిండప్రదానము చేసినవాడు, ఇరువదియొక్క తరముల వారిని తరింపజేయును.


First    10  11  12  13  14  15  16  17  18  19  20  21   Last

No comments:

Post a Comment