మర్యాదలు చేసినందువలననే గర్వించి యిట్లు
మాటలాడుచున్నారు. ఇది మీతప్పుగాదు. మంచిచరిత్ర లేని మిమ్ము ఇంతవరకును
గౌరవించుట మా మంచితనమునకు నిదర్శనము. ఇంక మీ సాంబుని విడిచిపెట్టుట
జరగదు" అని కటినముగా సమాధానమిచ్చి, దుర్యోధనాదులు పురములోనికి
బోయిరి.
వారి మాటలకు బలబద్రునికి ఇంతంత అనరాని
కోపము వచ్చినది. "ఉగ్రసేను డాజ్నాపించినచొ దేవతలు కూడా
చేతులు కట్టుకొని నిలుచుని యుందురు. ఈ కౌరవులు దుర్మదాంలై ఈ ఉగ్రసేనుని, మమ్మును పాలించువారట, వీరి యాజ్నకు మేము బద్దులుమై యుండవలెనట.
ఉగ్రసేనుడనగా ఎవరనుకొన్నారో వీరు. అతని సేవకులభార్యలు కూడా పారిజాత పుష్పమాలికలను
ధరింతురు అని తెలియదు కాబోలు. మదముచేత కన్నులు కానరాని ఈ కౌరవులు నందరును భీష్మ
ద్రోణాదులతో సహా యమపురికి పంపి లోకమును అకౌరావము చేసెదను "అనుచు తన
నాగలిని కోట ప్రాకారమునందు గ్రుచ్చి ఒక్క ఊపున పెల్లింపగా హస్తినాపుర మంతయు
పెద్దభూకంపము వచ్చినట్లు అల్లలనాడి పోయెను. ఆ ప్రళయ భీకరమైన బలరాముని కోపమును, పరాక్రమమును చూచి కౌరవులు గజగజా వణికిపోయిరి. వెంటనే సాంబుని, అతడు వలచిన కన్యను తీసుకువచ్చి, బలరాముని ఎదుట నిలిపి "ఓ మహానుభావా!
నీ మహామహిమ నెరుగక నోటికి వచ్చినట్లు మాటలాడి నిన్నునొప్పించినాము.
మాయపరాధములను మన్నింపుము. సాంబుని దెచ్చినాము. నీ కోపము నుపసంహరింపుము" అని
అనేక రీతులుగా ప్రార్ధించిరి. బలరాముడు సాంబుని జూచి శాంతపడెను. సాంబుడు
పెడతండ్రికిని, అక్కడి భీష్మాదులకును నమస్కరించెను. బలరాముడు వారిని
దీసుకొని ద్వారకకు పయనమయ్యెను.
No comments:
Post a Comment