Friday, August 2, 2013

శ్రీ అగ్ని పురాణము8




ఆచారములు
మానవుడు ప్రతిదినము ఆచరింపవలసిన కర్మలనే ఆచారము(లు) అందురు.

బ్రహ్మ ముహుర్తమున అనగా తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి దైవప్రార్ధన చేయవలెను. పగటివేళ ఉత్తరముఖముగా కూర్చుండి మలమూత్రవిసర్జన చేయవలెను. రాత్రియందు  దక్షిణముఖుడై చేయవలెను. సంధ్యాకాలమందు ఉత్తరముఖుడై చేయవలెను. అవికూడా దారిలోగాని నీటిలో గాని చేయరాదు. గడ్డి మొలచిన చోట విసర్జనము చేయవలెను. కాలకృత్యములు దీర్చుకొని దంతధావనము చేయవలెను. తరువాత స్నానము చేయవలెను. స్నానము చేయకుండా చేసిన పూజావ్రతాదు లేవియు ఫలముల నియ్యవు.

స్నానమునకు నూతి నీళ్ళు, నదినీళ్ళు, సరస్సులలోని నీళ్ళు మంచివి. పున్యతీర్దోదకములు, గంగాజలములు మరింత మంచివి. స్నానము చేసిన తరువాత అంతస్శుద్ది  కొరకు ఆచమనము చేయవలెను. బ్రాహ్మణులైనచో ఆఘమర్షణ సూక్తములు జపించవలెను. పురుష సూక్తము కూడా జపించవచ్చును. ఉత్తరీయమును పిండుకొని దేవతా పితృ తర్పణము చేయవలెను. బట్టలు పిండుకొన్న తరువాత సంధ్య వార్చవలెను. తరువాత అగ్నిలో హొమములు చేయవలెను.

స్నానాంతరము దైవధ్యానము చేసి, పిదప దైవదర్శనము చేయవలెను. బరువు మోయువానికిని, గురువులకును, గర్భిణీ స్త్రీలకును ప్రక్కకు తొలగి దారి యివ్వవలెను.  సూర్యుని ఉదయించునప్పుడు అస్తమించునప్పుడు చూడరాదు. (అల్ట్రా వయొలెట్ కిరణములు మన కన్నులకు హాని చేయును) నీళ్ళలో గూడ సూర్యబింబమును చూడరాదు. నగ్నముగా నున్న స్త్రీని చూడరాదు. నూతిలో (నీటిలో) తన నీడ చూచుకొనరాదు. వద్యస్థానమును చూడరాదు. పాపాత్ముని చూడరాదు.

ప్రత్తిని, ఎముకను, భస్మమును దాటరాదు. పరుల అంతః పురమునకును, ధనముండు గదికిని పోరాదు. ఎంతో అవసరమైనప్పుడు గాని ఇతరులకు దూతగా వెళ్ళరాదు. నోటితో ఈల వేయరాదు. దీపము లేకుండా రాత్రివేళ ప్రయానించరాదు. సింహద్వారము గుండా ఇంటిలో ప్రవేశించవలెను. గాని గోడలు దూకి కాదు. కట్టిన బట్టను తిరగవేసి మరలా కట్టుకొనరాదు. ఎప్పుడును శుభములనే పలుకవలెను. అశుభము పలుకరాదు. పెద్దవారి మధ్యనుండి వెళ్ళరాదు. రెండుచేతులతో బుర్ర గోకికొనరాదు. నీళ్ళలో మలమూత్రములు విడువరాదు. నదులలో గాని జలాశాయములలో గాని నగ్నముగా స్నానము చేయరాదు. " నాప్సు మూత్ర పురీషం కుర్యాత్ | న వివ సనః స్నాయత్ "  అని వేదము కూడా చెప్పును.

First  2  3  4  5  6  7  8  9  10  11  Last

No comments:

Post a Comment