Wednesday, August 14, 2013

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam43




యువ గో దుమా శాలిజా లింగం:- జొన్నలు, గోధుమలు బియ్యం ఆడించి
పిండితో లింగం చేసి పూజిస్తే పుత్ర లాభం కలుగుతుంది. దానం వర్ధిల్లుతుంది.
సర్వం శివ మాయం జగత్
సితాఖిండ లింగం :- పటిక బెల్లంతో శివలింగాన్ని చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది.
లవణ లింగం:- హర తాళం (ఒక ద్రవ్యం) త్రికటుకాల చుర్ణంలో ఉప్పు కలిపి
లింగం హేసి పూజిస్తే వశీ కరణ శక్తి వస్తుంది.
తిలపిష్టి లింగం:- నువ్వులను రుబ్బి ముద్దు తో లింగం చేసి పూజిస్తే
 కోరికలు నేర వేర్తయి.
భస్మ లింగం :- బలంతో కాని పంచ దారతో గాని లింగాన్ని పూజిస్తే
సితా లింగం:- సుఖాన్ని కలిగిస్తాయి.
వంశాంకుర లింగం:- వెదురు చిగుళ్ళతో లింగం చేసి
పూజిస్తే వశం నిలుస్తుంది.
పిష్టి లింగం:- పిండి లింగం విద్యాప్రదం.
దద్ దుగ్ద లింగం:- పెరుగులో పాలు కలిపి నీళ్ళు ఒత్తి లింగం చేసి
 పూజిస్తే సంపద సుఖిం వస్తాయి.
దాన్యలింగం :- దాన్యప్రదం.
ఫలలింగం:- ఫలప్రదం.
ధాత్రీ లింగం:- (ఉసిరి కాయలతో లింగం చేసి పూజిస్తే) ముక్తి ప్రదం
నవనీత లింగం:- (వెన్నలింగం) కీర్తి, సౌభాగ్యకరం
దుర్వాకండజ లింగం:- (గరికలింగం) అపమృత్యునివారకం
కర్పూర లింగం:- ముక్తి ప్రదం
అయస్కాంత లింగం:- ఆయస్కంతాన్ని లింగాకారం గా
 చేసి పూజిస్తే సిద్ద ని కలిగిస్తుంది.
మౌక్తి క లింగం :- (ముత్యాల భస్మంతో చేసిన లింగం)
సౌభాగ్యన్నిస్తుంది.
సువర్ణ లింగం (బంగారు లింగం) మహాముక్తి ప్రదం
రాజత లింగం (వెండి లింగం) సంపత్కరం.
పిత్తల లింగం:- కాంస్య లింగం (ఇత్తడి- కంచు లింగాలు) ముక్తి నిస్తాయి.
త్రపు లింగం, ఆయసలింగం, (తగరం తుత్తం, ఇనుము, సీసం లింగాలు)
:-శత్రునాశకాలు.
అష్ట ధాతులింగం:- సర్వ సిద్ద్ ప్రదం
అష్ట లో హలింగం :- కుష్తువ్యాద్ హరం
సృటిక లింగం:- సర్వకామప్రదం

No comments:

Post a Comment