Thursday, August 22, 2013

బ్రహ్మపురాణము13




మహర్షులు "మూడు రోజుల తరువాత చంద్రుడుత్తర ఫల్గునీ నక్షత్రములో నుండగా మైత్ర ముహూర్తమున శంకరుడు మీ కుమార్తెను పాణిగ్రహణము చేసికొనును" అని చెప్పి, హిమవంతుడు చేసిన సత్కారములను స్వీకరించి మందార పర్వతమునకు వెళ్లి, ఈశ్వరునితో సంబంధము నిశ్చయించుకొని వచ్చినామనియు, మూడురోజులలో ముహూర్త మనియు విన్నవించిరి.

నగరమంతయు అలంకరించిరి. సూర్య చంద్రులు తమకాంతులచేత ఆ నగరమును ఆహొరాత్రులు ప్రకాశమానముగా జేసిరి. అప్సరసలు నాట్యము చేసిరి. గంధర్వులు పాడిరి. దేవదుందుభులు మ్రోగినవి. కళ్యాణమండపము వద్ద దేవతలు మునులు అమ్దరును ఆసీనులై వేద మంత్రములు ముక్త కంటముతో చదివిరి. మేనాహిమవంతులు కన్యాదానము చేసిరి. బ్రహ్మ అగ్నియందు అజ్యాహుతులు  వ్రేల్చెను. వదూవరులకు పాణిగ్రహణము చేయించి అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణము చేయించెను. మహామునీంద్రులు వేదాశీస్సులు పలికిరి. దేవతలందరును నూతన వధూవరులకు వస్త్రమణి భూషణాదులు కానుకలుగా నిచ్చిరి. సమస్త లోకములను గిరిజాశంకర కళ్యాణసమయమున అనిర్వచనీయానందమును ననుభవించెను.

ఈగౌరీశంకరుల కళ్యాణకథ పరమ పవిత్రమైనది. సర్వపాతకములను హరించునట్టిది. అని సూతుడు మునులకు చెప్పెను.

మన్మథ దహనము
ఒకనాడు పరమేశ్వరుడు పార్వతితో గలిసి మేడమీద కూర్చుండి యుండగా కొందరు మహామునులు అచ్చటికి వచ్చిరి. శంకరుడు వారితో స త్ప్రసంగములు చేయుచుండెను. ఆ సమయములో మన్మథుడు రతీదేవితో కూడి అచటికి వచ్చెను. ఈశ్వరుడు, సమయాసమయములు గుర్తింపకుండా వచ్చిన మన్మథుని జూచి, కోపించి తన మూడవ కంటిఅగ్నితో అతనిని కాల్చివేసెను. అట్లు నిర్జీవుడైన తనభర్తను సజీవుని జేయుమని కోరెను. గౌరీశంకరులు ఆమెను ఓదార్చి, "మన్మథుడు ఇంక శరీరముతో బ్రతికి యుండడు. కాని అనంగుడై కూడా అతడు తనపని తానూ చేయుచూనే యుండును. శ్రీమన్నారాయణుడు భూమండలములో యదువంశమున వాసుదేవుడై జన్మించును. ఆ శ్రీకృష్ణునకు పట్టమహిషియైన రుక్మిణి యందు ప్రద్యుమ్నుడను పేరుతొ నీ భర్త జన్మించును. ఆపుడు నీవు మానవకాంతవై అతనిని పెండ్లి యాడెదవు విచారము మానుము" అని పంపివేసిరి.

పురుషోత్తమ క్షేత్రము (పూరీ జగనాథము)
మహామునులందరును పురుషోత్తమ క్షేత్రమును గురించి చెప్పుమనగా సూతుడిట్లు చెప్పనారంభించెను.


First    10  11  12  13  14  15  16  17  18  19  20  21   Last

No comments:

Post a Comment