ఒకప్పుడు మేరుపర్వత శిఖరభాగమునందు సకల
దేవతలు, మునిగణములును సేవించుచుండగా లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు
కొలువుండెను. అపుడు లక్ష్మీదేవి తన భర్తను జూచి "భూలోకమును కర్మభూమి
యందురుకదా! అందు జన్మము లభించుటే పుణ్య విశేషము అందురుగదా! మరి, ఆ భూమిలో జన్మించినవారు చాలామంది
కామక్రోధ లోభాది షడ్వర్గములకులోనై విహిత
కర్మలుచేయుట మానుచున్నారు. ఇదేమి చిత్రమో తెలిసికొనవలెనని యున్నది. దయచేసి
నాకు చెప్పుడని" కోరగా శ్రీమన్నారాయణుడిట్లు
చెప్పసాగెను.
"పురుషోత్తమ క్షేత్రము" అని సముద్ర
తీరమున నొక క్షేత్రము గలదు. అందు పురుషోత్తముడు నివసించును. దానికి సమానమైన
క్షేత్రము మరియొకటి భూమండలమున లేదు. అక్కడ నా విగ్రహము ఇంద్రాది దేవతలచే, ఎవ్వరికిని కనబడకుండా
దాచబడియుండెను. అందుచేత నది క్షేత్రరాజము అని చెప్పబడెను.
కల్పాంత ప్రళయమునందు యోగనిద్ర చెందిన నేను
ప్రళయానంతరము నిద్రనుండి లేచి, సృష్టిచేయ సంకల్పించి, నాభికమలము నుండి బ్రహ్మను
సృజించినాను. అతడు పంచభూతములను, వానినుమ్ది స్థూల సూక్ష్మ
రూపములైన వస్తు జాలమును సృష్టించెను. అవి చరములనియు
ఆచరములనియు రెండు విధములుఅయ్యెను. బ్రహ్మ మరల ప్రజాపతులను, మరీచి మున్నగు మునివరులను తన
సంక్లాపముతో సృజించెను. మరియు అండజములు (గ్రుడ్ల నుండి
పుట్టినవి) జరాయుజములు (మావినుండి పుట్టినవి) స్వేదజములు (చెమట నుండి
పుట్టినవి), ఉద్భేద జాములు (భూమినుండి మొలకెత్తినవి) అను నాలుగు
విధములైన జీవరాసులను సృష్టించెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణముల వారిని, అంత్యజులను, మ్లేచ్చులను గూడ సృష్టించెను.
వారికి ఆహారములుగా తృణగుల్మ వృక్షలతాదులను సృష్టించెను. తన శరీరమున
దక్షిణభాగము నుండి పురుషుని, వామభాగము నుండి స్త్రీని సృష్టించి, వారిని దంపతులను జేసి సంతానమును
వ్రుద్ధిచేసుకొనడని చెప్పెను. అది మొదలుకొని స్త్రీ
పురుష సంగమము వలన సకల జీవరాసులు జన్మించు వ్యవస్థ యేర్పడినది. నేను విరాడ్రూపుడనై
ఆయా జీవజాలములలో ఆత్మస్వరూపుడుగా నిలిచియున్నాను.
ఒకప్పుడు బ్రహ్మ నన్ను జూచి, "మహాత్మా! ఈ సృష్టిలో బహువిధములైన
స్వభావములు గలవారు పుట్టుచున్నారు. కొందరికి
పుణ్యకర్మలు చేయు బుద్ధి పట్టుటలేదు. అట్టివారికి స్వర్గాది పుణ్యలోకములను, కైవల్యమును ఎట్లు కలుగునో
సెలవిమ్ము" అని కోరెను. నేను "కమలాసనా!
దక్షిణదేశమున సముద్ర తీరమున ఒక వటవృక్షము మున్నది. దాని నీడలో గూర్చున్నచో
బ్రహ్మహత్యాది దోషములు గూడ నశించు
No comments:
Post a Comment