Wednesday, August 14, 2013

బ్రహ్మపురాణము30



పితృదేవతలను గూర్చిన విశేషములు
అమావాస్యనాడు పిండ పితృయజ్ఞము చేయవలెను. సంవత్సరమున కొకసారి తల్లిగాని తండ్రిగాని మరణించిన తిథియందు వారి నుద్దేశించి శ్రాద్ధము చేయవలెను.
సపండీకరణమున ముగ్గురు బ్రాహ్మణులను పెట్టవలెను. విశ్వేదేవత లక్కరలేదు. పవిత్రము కూడా ఒక్కటే. ఇవన్నియు అపసవ్యముగానే చేయవలెను. తిలలు, కంథము, నీరు గలపాత్రాలు నాలుగు ఉండవలెను. పితరులకు మూడు, ప్రేతకు ఒకటి. ప్రేత పాత్రము నుండి అర్ఘ్యమును దీసుకొని "యేసమానా" మంత్రము చెప్పుచు పిత్రుపాత్రాలు మూడింటిలో అర్ఘ్యము విడువవలెను. ఏకోద్ధిష్ట విధానములో స్త్రీలకూ కూడా అంతే. ప్రతి సంవత్సరము స్త్రీలకూ ఏకోదిష్టము చేయవచ్చును. అదియును పుత్రులు లేనివారికే. ఆబ్దికమునాడు పితరులకు అట్లు చేయవచ్చును అందురు. పుత్రులు లేనప్పుడీ సపండీకరణమును సపిండులు చేయవచ్చును. పౌత్రులు చేయవచ్చును. మాతామహునకు (తల్లి యొక్క తండ్రికి) దౌహిత్రుడు చేయవలెను. తల్లితండ్రులు రెండు వంశములకును కర్తలగుదురు. పితరులకును, మాతామహులకును సమానముగా శ్రాద్ధక్రియలు చేయవలెను.

ఎవ్వరును లేనిచో స్త్రీలే అమంత్రకముగా శ్రాద్ధాదులను చేయవలెను. లేదా! తమ జాతివానిచే చేయింపవచ్చును.

సపిండీకరణము తరువాత స్వర్గపాథేయము పుచ్చుకొన్న ప్రపితామహుడు పిండమును వీడి, లేపభుజుడనబడును. పిండముల రూపములోని పితరులు అలేపభుజులు. స్వర్గపాథేయము పుచ్చుకొన్న వానినుండి పై యిద్దరును (మొత్తం ముగ్గురు), అలేపభూజులును, యజమాని (కర్త)యు, మొత్తము ఏడుగురు. ఇది సాప్ట పురుష సబంధము. ఇంకను ఆపైవారు అనులేపభుజులు. వారిలో నరకవాసులు, పశుపక్ష్యాది రోపములో నున్నవారు, భూతములో జేరినవారు యాజమాన కృతమైన శ్రీద్ధముచే తృప్తి పడుదురు. వికిరాన్మమున కొందరు త్రుప్తులగుదురు. పిశాచత్వము నామదిన వారికిది తృప్తినిచ్చును.

స్నానము చేయునపుడు బట్టనుండి కారిన నీళ్ళతో కొందరు తృప్తులగుదురు. ఇది వ్రుక్షరూపులగు వారిసంగతి. భూతములై యుండువారు, గంధము తీయునపుడు క్రిందపడు నీటితో తృప్తి నొందుదురు. పశువులలో జన్మించినవారు పిండము లెత్తునపుడు నేలమీద బడిన నీరు గ్రాగి తృప్తులగుదురు. దంతాలు కూడా రాని బాలకులును, ఏ కారణము చేతను వెలివేయబడిన వారును, శ్రాద్ధము పెట్టు యజమానులు చేతినుండి జారిన నీళ్ళతో తృప్తి నొందుదురు. మరికొందరు బ్రాహ్మణులు భుజించిన తరువాత ఆచవించునపుడు నేలను పడిన నీళ్ళతోను, కొందరు పాదప్రక్షాళన చేసిన యుదకముతోను తృప్తి పడుదురు. ఇట్లు ఒక యజమాని శ్రాద్ధము చేయునపుడు అతని వంశము వారెల్లరును తృప్తి నొందుదురు. ఇట్లు పితృదేవతలను సంతృప్తి చేయువారికి ఇంతమందిని తృప్తిపరచిన మహాపుణ్యము కలుగును.
అన్యాయముగా సంపాదించిన ధనముతో శ్రాద్ధము చేసినచో అది పితరులకు ముట్టదు. రాక్షసులకు చెందును. పితృదేవతల ఆశీస్సులు పొందినవాడు భూమియందు ఆయురారోగ్యఐశ్వర్యాలతో సుఖపడును.


First   20  21  22  23  24 25 26 27 28 29 30 Last



No comments:

Post a Comment