Wednesday, August 7, 2013

శ్రీశైల స్ధల పురాణము SriSailastalapuranam29





శ్రీ శైల స్థల పురాణము
ఉత్తర ప్రకారము
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఒక యోగి, ఆ యోగి కి శివాను గ్రహము చూపు చిత్ర మొకటి గలదు. భైరవ దృశ్య మొకటి యున్నది. మరొకటి పాదుకలపై నిలబడి. కపాలముల మాలను, చేత పట్టుకొని ఈతడున్నాడు. చేతిలో త్రిశూలము ఎడమ చేతితో డామరు, ఖడ్గము కపాలము గలవు. కుడి ప్రక్కన నాగము, ఎడమ ప్రక్కన శునకము గలవు.
మరియొక  దృశ్యము - మహిషాసుర మర్ధిని. ఈమె ఎడమ కాలితో మహిషాసురుని కంటము త్రొక్కి కుడి కాలు నేల పై నుంచినది. ఎనిమిది చేతులు గలవు. దిగువ క్రింద చేతితో మహిషాసురుని దేహమందు శూలము గ్రుచ్చు చుది దిగువ యెడమ చేతితో శిరస్సు పట్టుకొని యున్నది. తక్కిన చేతులతో వివిధా యుధములు ధరించి యున్నది.
కుమారస్వామి, తక్కిన దేవతలు ఇట చిత్రింప బ బడినారు. ఉమా మహేశ్వరుల దృశ్య మొకటి ఇట గలదు. మహాశ్వరుడు దిగువ యెడమ చేతితో పార్వతి పట్టుకుని యుండ, ఆయన యెడమ తోడ పై పార్వతి గూర్చుండి యుండినది. బ్రహ్మ శివునకు కుడి ప్రక్కన నిలిచి యున్నాడు. ఒక స్త్రీ నడుమ గలదు. మరియొక దృశ్యము గణపతి మరియొక దృశ్యము పార్వతి పరియనము. తన కుడి చేతితో శివుని ఎడమ చేతిని పట్టుచు శివుని కెదురుగా పార్వతి నిలిచి యున్నది. బ్రహ్మ విష్ణులు గూడ ఇటగలరు.  
భిక్షాటన మూర్తి  మరియొక దృశ్యము ఇట్లే మరికొన్ని, వృషభ వాహన మూర్తి శివుడు, ఒక బోయతతో శివుని మృగ యా విహారము, త్రిమూర్తులు, గజాసుర సంహారము, రాజ కుమారి దృశ్యము, శివాలయము, నరబలి, జంతు బలి మొదలగునవి యున్నవి.
శైవ మతములు
శైవ మతము 10 ,11 ,12 శ తాబ్దుల యందు ఎక్కువగా వృద్దికి రా  నారంభిచినది. పూర్వ చాళుక్యులు, కాకతీయులు ఎక్కువగా ప్రోత్సాహ మోసంగి నారు. ఇది ఒక రాజ మతముగా నాడు వెలిసినది. చెడి రాజులూ, చోళరాజులు, మాళవ రాజులూ, చాళుక్యరాజులు, కాకతీయ రాజులు, శైవ మతమును స్వికరించినారు. వారు శివ క్షేత్రములు అభివృద్ధి కి గురువులు సమదర మునకు శైవ మతభి వృద్దికి దన్మూలమున శైవ మత ప్రచారమునకు పట్టు కొమ్మలై వెలసినారు.

No comments:

Post a Comment