Wednesday, February 12, 2014

భుజించేటపుడు పాదాలు భూమిని తాకాలి?



ఆధ్యాత్మికం

ఆహారాదేవ అభివృద్ధి : బలం ఆరోగ్యం వర్ణేంద్రియ ప్రసాదశ్చ- ఆహారం వల్లనే శరీర వృద్ధి, బలము, ఆరోగ్యము, శరీరవర్ణము, ఇంద్రియాలకు ప్రసన్నత కలుగుతాయని సుశ్రుతసంహిత వివరించింది. శరీరాన్ని పెంపొందించడానికి, బవం కలగడానికి, సాంసారిక సుఖాలను అనుభవించడానికి తగిన శరీరాన్ని నిర్మింప చేసుకోవడానికి ఆహారం తీసుకోవడం అవసరం. 
ఆకలిని తీర్చుకోవడానికి మాత్రమే ఆహార పదార్థాలను తింటున్నామని అనుకోరాదు. మనం భుజించే ఆహారం పదార్థం పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారం తీసుకునేందుకు ముందు పరిశుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని, ఆచమనం చేసి పవిత్ర పరిశుభ్ర ప్రదేశంలో పరులు రాకపోకలు జరుపని ప్రదేశంలో, భుజించడానికి కూర్చోవాలి. 
అప్పుడు కామక్రోధలోభమోహాదులకు మనస్సులో చోటివ్వరాదు. అన్ని వ్రేళ్ళతో కలుపకొని తినాలి. భుజించినప్పుడు నోటిశబ్ధం చేయరాదు.  ఇది శాస్త్రాదేశం. భుజించడానికి ముందు ఒక పీటపై పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. పీటలేనపుడు చిన్న చాపను ఉపయోగించవచ్చు. 
 పద్మాసనం వేసుకోవడం వల్ల పొట్ట పెరగదు. పొట్టను అణచడం వల్ల ఎక్కువగా తినలేరు. పాదాలు భూమికి తాకుతుండాలని పండితులు చెబుతున్నారు.



ఆధ్యాత్మికం


No comments:

Post a Comment