పుత్రీ
! చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను.
దానివలన వైధవ్యము నుండి
నీకు నివృత్తి కలుగగలదు".
అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము
ఉపదేశించెను.
మైత్ర్యి
ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని
కూడా భక్తితో
వ్రతమును ఆచరించెను. నాగాలోకమునకు చేరిన
చంద్రాంగదుడు నాగారాజుచే
సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి
మరలివచ్చెను. అందరూ సంతోషించి ఈ
విధంగా ఎడబాసిన పతీ పత్నులు
వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు.
సదాశివుడు
మరియొక సంఘటనను కూడా చెప్పదొడగెను.
మహాతపస్వి యైన మృకండునకు సంతాన
ప్రాప్తి కలుగక పోగా ఆటను తపస్సు
చేసి సదాశివుని పుత్ర భాగ్యము కొరకు
ప్రార్దించెను.
శివుడు ప్రత్యక్షమై "మహర్షి! నీకు పదహారు సంవత్సరముల
ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావలెనా? నూరు సంవత్సరములు
ఆయువుగల అత్యధమ
పుత్రుడు కావలయునా?" అని ప్రశ్నించెను.
ఋషి " నాకు న్పదహారు సంవత్సరముల
ఆయువుగల సత్పుత్రుడు చాలు" అనెను.
శివుని అనుగ్రహంతో "మార్కండేయుడు" అనే
సత్పుత్రుడు జన్మించెను.
ఆయువు మిగియచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల
వ్రతమును
ఆచరించి శివుని కృపకు పాతుడై చిరంజీవి అయ్యెను.
ద్వాపర
యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను.
దాని
నివారణకొరకై అతను జాంబవంతుని పై విజయము సాధించి,
మణిని సంపాదించి,
జాంబవతిని పరిణయమాడెను.
సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము
ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను.
బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి.
శ్రీకృష్ణుడు
ఈ వ్రతమును వృద్ధుడు యోగ్యుడు అయిన బ్రాహ్మణునకు పదేశించెను.
దాని ఫలమున దరిద్రునకు సామ్రాజ్యము చిక్కెను.
శివపార్వతులు
భూలోకమున సంచరించుచు,
ఒక సారి వైశ్యుడు - వైశ్యుని భార్య -
రూపమునందు
దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడ నారంభించిరి.
అందు శివునకు అపజయము
కలిగెను.
"వైశ్యుడే గెలిచె" నని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపము
కలిగెను.
అసత్యము పలికిన అర్చకుని తత్ క్షణమే కుష్టురోగి కమ్మని శపించెను.
అర్చకుడు వికృత రూపుడయ్యెను.
" శివ,శంకరా" అని అరుస్తూ అతను క్రింద
పడిపోయాడు. అంతట సుందరియైన
No comments:
Post a Comment