వీరి అలజడికి శివుడు లేచిపోయెను .అతని వీర్యము ఆకులపై బడెను.దానినుండి కుమారస్వామి పుట్టెను .అతనిని కృత్తికలు అను ఆరుగురు ముని కుమార్తెలు పెంచిరి .పార్వతికి దేవతలపై కోపము వచ్చి దేవతా స్త్రీలకు దేవతలవలన గర్భోత్పత్తి ,పుత్ర సంతానము లేకుండు నట్లు శపించెను . కృత్తికలు ,తాము పెంచిన కుమారుడు శివుని కొడుకని తెలిసికొని శివ పార్వతుల కొసంగిరి.
పార్వతికి స్వగర్భ జనితమైన సంతానము కావలెనని కోరిక యున్నది .పుణ్య వ్రత మాచరించినచో సంతానము కలుగునని బ్రహ్మ చెప్పగా ఆమె ఆ వ్రత మాచరించెను. సనత్కుమారుని పురోహితునిగా జేసికొని యదా శాస్త్రీయముగా వ్రతమును పరి సమాప్తి చేసెను. వ్రతానంతరము బ్రహ్మకు దక్షిణ యియ్యవలసి యుండెను ."ఏమి దక్షిణ కావలెనో అడుగు "మనగా సనత్కుమారుడు , "నీ భర్తను నాకు దక్షిణగా ఇ" మ్మని పార్వతిని అడిగెను. పార్వతి తెల్ల బోయెను. సనత్కుమారునితో ,"అయ్యా ! ఇదేమి కోరిక ! ఇదేమి దక్షిణ ? భూములు ,మణులు ,సువర్ణాదులు ,వస్త్రములు దక్షిణగా అడుగుదురు కాని యిదేమి వింత దక్షిణ ? నేను వ్రతము చేయుచున్నది పుత్రులు కావలెనని గదా ! నా భర్తను దక్షిణగా నీవు పట్టుకొని పోయినచో నాకు పుత్రుడెట్లు కలుగును ? ఇంక ఈ వ్రతము చేసియేమి ప్రయోజనము ? సంతానము గలుగుట యట్లుండగా భర్తను గూడ పోగొట్టు కొనుటకా ఈ వ్రతము ? నూరుగురు పుత్రులున్న దాని కంటే భర్త సాన్నిధ్యమే మేలు గదా ! ఇది వేద శాస్త్ర సమ్మతమైనను యెవడిట్టి నిర్ణయము చేయగలడు? లోకాచార మనునది యొకటి యున్నది కదా ! దానిని విడిచి పెట్టి యెవడు ప్రవర్తింపగలడు? మరొకటి ఏమైనా దక్షిణగా అడుగుము ఇచ్చెద" ననెను . సనత్కుమారుడు ," అమ్మా ! నీవు శక్తి స్వరూపిణి వి .నీకు తెలియనిదేమున్నది ? వేదములందును శాస్త్రము లందును ఈ వ్రత విధానము చెప్పబడి యున్నది. దానికి దక్షిణగా భర్తను పురోహితునికి య్యవలెనని కూడా చెప్పబడి యున్నది . కావున నీవు దక్షిణగా నీ భర్త నిమ్ము " అనెను. పార్వతి యొప్పుకొనలేదు. బ్రహ్మాది దేవతలు చెప్పి చూసిరి . లాభము లేక పోయెను. అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై పార్వతితో " తల్లీ ! నీవు చెప్పినది నిజమే . కాదనలేము . లోకాచారము గూడ పాటించ వలసినదే .ఐనను ఫలమును గోరి చేయు వ్రతము (కామ్య వ్రతము ) లో అర్ఘ్య పాద్యములు ,స్నాన వస్త్ర గంధ ధూప దీప నైవేద్య తాంబూలాదులు అన్నియు అంగములే. ఏ అంగము సరిగా లేకపోయినను అంగ వైకల్య మేర్పడినట్లే కదా ! మనుష్యుల కైనను సర్వాంగములు బాగున్నపుడు వాడు శక్తి మంతుడై సర్వ కార్యములను నిర్వహింప గలుగును. అంగములు కొన్ని సరిగా లేనిచో వాడు సంపూర్ణ శక్తి మంతుడు కాలేడు. అట్లే వ్రతము నందు కూడా సర్వాం గములు పరి పూర్ణముగా నున్నచో కోరిన ఫలము లభించును .ఎక్కడ లోపమున్నను ఫలము కలుగదు .కావున
No comments:
Post a Comment