Saturday, February 15, 2014

శివ గీత27




మహా పాశుపతం నామ - దివ్య మస్త్రం దదౌ తతః ,
ఉక్తశ్చ తేన రామోపి - పాదరం చంద్ర మౌళినా. 14
జగన్నాశ కరం రౌద్ర - ముగ్ర మస్త్ర మిదం నృప,
అతో నేదం ప్రయోక్తవ్యం - సామాన్య సమరాదికే .15
అన్యో నాస్తి ప్రతీ ఘాత - ఏతస్య భువన త్రయే,
తస్మా త్ప్రాణాత్యయే రామ! - ప్రయోక్తవ్య ముపస్తితే.16

తరువాత గొప్ప ధనస్సును తగ్గని అమ్ములపోదిని,
పాశుపతాశ్రమును ప్రసాదించెను.
వెనువెంటనే మహాదేవుడు శ్రీరాముని గురించి యిట్లు
బోధించెను: ఓయీ రామా! ఈ మహాస్త్రము రౌద్రము
 (రుద్రునికి సంబందించినది ) జగత్ప్రలయము గావించును
కావున సామాన్య యుద్దములలో ఈ మహాస్త్రము నుపయోగింపకుము.
స్వర్గ- మర్త్య -పాతాళము ఈ ముల్లోకములలో ను ఎ యొక్కడైనను
 ఈ మహాస్త్రము దాటిని భారించిప్రతీకారము చేయువాడు లేడు.
 కనుక తనకు ప్రాణాపాయము సంభవించు సందర్భము న మాత్రమే
 దీనిని ప్రయోగించాలి తక్కిన సమయాల్లో దీని నుపయోగింప తగదు.
 దీని నుల్లంఘించిన యెడల జగత్సంహారము జరుగును.

అన్య దైత త్ప్రయుక్తం చే -జ్జగత్సం క్షయ కృద్భ వేత్,
అధా హూయ సుర శ్రేష్టా - న్లోక పాలా న్మహేశ్వరః 17
ఉవాచ పరమప్రీతః - స్వం స్వ మస్త్రం ప్రయచ్చత,
రాఘవో యంచ తైరస్త్రై: -రావణం నిహ నిష్యతి .18
తస్మై దేవై రవ ధ్యస్త్వ - మితి దత్తో వరో మయా,
తస్మా ద్వానర తామేత్య - భవంతో యుద్ద దుర్మదా: 19
తదుపరి దేవతలను, దిక్పాలురును రప్పించి మిగుల యానందము
 తోడ ఓయీ ! దేవతలారా ! మీమీ యాయుధంభులను ఒసగుడు.
 శ్రీరాముడా యా అస్త్రముల శక్తి చేత రావణాసురుని వధించును,
ఎ కారణము చేతనైతే దేవతల చేత వధింప బడని వరము నొసగితివో
నా కారణము వలన మీరంద రిప్పుడు వన చరులై పరాక్రమించి
ఈ శ్రీరామునికి చేయూత నివ్వండి. పిదప స్వస్తులు కాగలరు
అని శివుడు యాజ్ఞాపించెను.

సాహాయ్య మస్య కర్వన్తు- తేన సుస్థా భవిష్యద,
తదాజ్ఞాం శిరసా గృహ్య - సురాః ప్రాం జలయ స్తదా. 20
ప్రణమ్య చరణౌ శంభో - స్స్వం స్వమస్త్రం దదుర్మదా,
నారాయాణాస్త్ర దైత్యారి - రైంద్ర మస్త్రం పురందరః 21



First 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Last

No comments:

Post a Comment