Wednesday, February 5, 2014

శ్రీ లింగ పురాణము10






నారదుడు ఒక వేయుయేండ్లు గూబరాజు దగ్గర సంగీతము నేర్చెను. తరువాత విష్ణువు సన్నిధిలో పాట పాడి వినిపించగా ఆయన " నారదా! నీవు చాల శ్రమ పడి నావు. కాని తంబురుని సంగతుల మేళగింపులో ఒక నైపుణ్యమున్నది. అది నీకు రాలేదు. నీకు తంబురుని గెలువ వలెనన్న పట్టుదలయున్నచో, నేను వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగ మునందలి ద్వాపర యుగమున భూలోకములో కృష్ణుడుగా నవతరించెదను. అప్పుడు నిన్ను గాన విద్యలో మహావిద్వాంసుని జేసెదను. రమ్ము " అని పంపివేసెను.

శ్రీ కృష్ణుడు భూలోకములో అవతరించెను. నారదుడు శ్రీ కృష్ణ దర్శనార్ధమై ద్వారకకు వచ్చెను. ఆయన నారదు నాదరించి, జాంబవతిని బిలిచి, " నీవీ నారదునికి ఒక్కయేడు సంగీతము చెప్పి ప్రవీణునిజేయు" మనెను. ఆమె నారదునికి అట్లే నేర్పెను. అష్ట మహిషులతో కూర్చుండి కృష్ణుడు నారదుని గానివిద్యను బరీక్షించెను. సత్యభామ " ఇంకను ఇతని కంఠమున అపశ్రుతులు వినవచ్చుచున్న " వనెను. దానికి నారదుడు విచారించుచుండగా శ్రీ కృష్ణుడాత నిని ఓదార్చి" నేనె స్వయముగా నీకు ఈ విద్య నేర్పి, సరస్వతికూడ ఆశ్చర్యపడునట్లు తీర్చి దిద్దెదను" అని ఒక్కయేడు తానే ఆయనకు విద్య నేర్పెను. నారదుడు మహా విద్వాంసు డయ్యెను. ఆ తరువాత గాన విద్యలో తుంబురుని మించి శ్రీమన్నారాయణుని మన్ననలు పొందెను.
విద్యలయందును, సత్కార్యములందును పట్టుదల, యెవ్వరి నైనను ఉన్నత స్థాయికి తీసికొని వెళ్ళునుగదా!
(పింగళి సూరన వ్రాసిన కళాపూర్ణో దయములోని నారద తుంబురగాన స్పర్దకు ఈ కధ మూలము కావచ్చును.)


First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  Last


No comments:

Post a Comment