(ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు
చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. )
......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము,
దక్షిణాయనము .
జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం
వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి
మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం
పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )
...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో
జరుగుచున్న ఋతువు పేరు )
............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో
జరుగు చున్న మాసం పేరు )
.......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము ,
అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో
పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు )
........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని )
శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ
విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా
శ్రీవైభవలక్ష్మి ముద్దిశ్య శ్రీ వైభవలక్ష్మి ప్రీత్యర్ధం పురుషులైనచో
శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః ,
గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి ,
గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః ,
అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి )
నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో )
మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,
అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం ,
పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం ,
(ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని )
దేవతా ముద్దిశ్య, శ్రీ.......... దేవతా పీత్యర్ధం సంభవ ద్భిరుపచారై:
సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి
(నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో ,
నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ )
ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .
గణపతి పూజ
అదౌ
నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం శ్రీ మన్మహాగణపతి పూజాం కరిష్యే
(ముకుళిత
హస్తాలతో విఘ్నేశ్వరునకు నమస్కరించాలి)
వక్రతుండ
మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం
కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా;
(అని చెప్పి
అక్షతలుంచ వలెను)
(ప్రతి
ఉపచారమునకు ముందు శ్రీమహాగణపతి పతయే నమః అని చెప్పవలెను)
శ్రీ మహాగణాదిపతయే నమః ధ్యాయామి - ఆవాహయామి –
నవరత్న
ఖచిత సింహాసనం సమర్పయామి; పాదయో
No comments:
Post a Comment