అనంతాది మహానాగా - న్కైలాస గిరి సన్ని భాన్ 42
కైవల్యో పనిషత్పారా - న్మణి రత్న విభూషితాన్,
సువర్ణ వేత్ర హస్తాడ్యం - నందినం పురత స్థ్సితమ్ 43
అధర్వ శిరస్సులతో శివుని స్తోత్రము గావించు మునులను
గంగానది సమేతుడునగు, నీలదేహము గలవాడై శ్వేతాశ్వతర
మంత్రములతో ఉమాకాంతుని స్తుతించు చున్న సాగరుని చూచెను.
కైలాస పర్వతము వలె ఉన్నతములైనవి మణి రత్నాద్య
లంకారములతో నొప్పుచున్నవి. యునై గైవల్యో పనిషత్తులను
పటించుచు శ్రీ మహాదేవుని స్తోత్రము చేయుచున్న అనంతాది
గొప్ప ఏనుగులను చూచెను మరియు స్వర్ణ మయ దండమును
చేత బూని యాగ్ర భాగంబున నిలిచియున్న నందీశ్వరుని కూడా చూచెను.
దక్షిణే మూషకా రూడం - గణేశం సర్వతో పమమ్,
మయూర వాహనా రూడ - ముత్తరే షణ్ముఖం తధా 44
మహా కాలంచ చండీశం -పార్శ్వ యోర్భీ షనాకృతిమ్,
కాలాగ్ని రుద్రం దూరస్థం - జ్వలద్దావాగ్ని సన్నిభమ్ 45
త్రిపాదం కుటిలాకారం - నట ద్బ్రుం గిరిటం పురః,
నానా వికార వదనా - న్కోటిశః ప్రమదాదిపాన్ 46
దక్షిణపు దిక్కున పర్వతో పమానం బైన మూషిక వాహనా
రూడుం డైన విఘ్నేశ్వరుని, ఉత్తరపు దిక్కున మయూర వాహనా
రూడుం డైన షణ్ముఖ స్వామిని, ఇరు పార్శ్వముల యందు
భీషణా కారములు గల మహాకాలుని , చండీశ్వరుని, మరియు
బడబాగ్ని ని వలె దూరమున నున్న కాలాగ్ని రుద్రుని,
అగ్రభాగమున మూడు పాదములు కలిగి వంకలు దిరిగిన
యాకృతి కలిగి నాట్యము చేయుచున్న బృంగీశ్వరుని
నానా ప్రకారము లైన ముఖములు కల అసంఖ్యాక
ప్రమధ గణాది పతులను చూచెను.
నానావాహన సంయుక్తం - పరితో.మాతృ మండలమ్,
పంచాక్షరీ జపా సక్తాన్ - సిద్ద విద్యాధ రాదికాన్ . 47
దివ్య రుద్ర కగీతాని - గాయత్కిన్నరబృందక మ్,
తత్ర త్రైయంబకం మంత్ర - జపద్ద్విజ కదంబకమ్ 48
గాయంతం వీణయా గీతం - నృత్యం తం నారదం దివి,
నృత్యతో నాట్య నృత్యేన - రంభా దీన ప్సారో గణాన్ 49
గాయచ్చిత్ర రధా దీనాం- గంధర్వాణాం కదంబకమ్,
No comments:
Post a Comment