Thursday, February 13, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము31




హొమములో స్వాహాకార ప్రాధాన్యము
విషము లేని సర్పమును ,వేద విద్య లేని బ్రాహ్మనుడను ,పతి సేవ చేయని వనితయు ,విద్యాహీనుడైన మనుష్యుడును ,పండ్లు పూవులు లేని వృక్షములను ఎట్లు నింద్యు లో అట్లే స్వాహా కారము లేని మంత్రము తోడి హోమము కూడా నిందార్హ మగును .(నిరర్ధక మగును ) స్వాహాకారము చివర గలిగిన మంత్రము తోడి హొమమే సర్వ కర్మల యందును సత్ఫలము నిచ్చును .
దాన మహత్యము : సామాన్య దినములలో చేసిన దానము ,చేసిన వానికి సమాన ఫలము నిచ్చును. అమావస్య యందును రవి సంక్రాంతి యందును ఫలము శత గుణము
(నూరు రెట్లు )గా నుండును. చాతుర్మాస్య యందును పూర్ణిమ నాడును చేసిన దానము అనంత ఫలము నిచ్చును. సూర్య గ్రహణ సమయములో చేసిన దానము ,పై దానికి పది రెట్లు ఫలము నిచ్చును. అక్షయ వట వృక్షము క్రింద నైనచో ఈ దాన ఫలము ఇంత అని లెక్కించి చెప్పలేము .
గర్భస్తునికిజ్ఞానము : దేవతలకు గాని ,మనుష్యులకు గాని ,రాక్షసులకు గాని పశు పక్షి కులములకు గాని గర్భము నందునుభవించు నరక సదృశ మైన దుఃఖము సమానమే గర్భములో నున్న జీవుడు తాను గతములో నెత్తిన జన్మములను ముందెత్త బోవు జన్మములను ,ప్రస్తుత మెత్తుచున్న జన్మమును పూర్తిగా తెలిసికొని యుండును .అట్లే ,చేసిన చేయబోవు కర్మములను గూర్చి కూడా తెలిసికొని యుండును .గర్భము నుండి బయట పడగానే విష్ణు మాయ చేత అన్నియు మరచిపోవును . తానే దిక్కున ,ఏ దేశమందు ,ఏ కాలమున బుట్టేనో గ్రహింపలేని అజ్ఞానములో బడి పోవును. ఆకలి మాత్రము తెలిసి తల్లి పాలకై యేడ్చును. తనకు కావలసినది అడుగలేడు. అక్కరలేనిది వద్దనలేడు. గర్భములో నుండి తాను పొందిన మహా యాతనను గూడ భూమి మీద పడగానే విష్ణు మాయ చేత మరచి పోవును.
అతిధి మర్యాద : అతిధి యింటికి వచ్చి ఏమియు తినకుండ ,త్రాగకుండ నిరాశ పడి వెళ్లి పోయినచో ఆ యింటి నుండి పితృ దేవతలు ,సర్వదేవతలు ,అగ్నులు ,
ఐశ్వర్యములు (లక్ష్మీ దేవి ) వెళ్లి పోవుదురు .
తల్లి దండ్రులు : జన్మ మిచ్చిన తలి దండ్రులు మనకు ప్రత్యక్ష దైవములు వారిని సర్వదా పూజించిన వారికి ఐశ్వర్యము ,జ్ఞానము ,పుణ్య లోకములను గలుగును .వారిని తిట్టి కొట్టిన వాడు కృతఘ్నుడు వాడు మహా ఘోరమైన వహ్ని కుండము (అగ్ని గుండము )అను నరకములో బడి చెప్పరాని దుఃఖము ననుభవించును.
పూజా ద్రవ్యములలో లోపము రానీయ రాదు : పూజకై నిర్ణయింపబడిన ద్రవ్యములు పూజకు అంగములని చెప్పబడును. ఇందులో ఏవి ఏమాత్రము తగ్గినను అంగ హాని (అంగము పోయినందువలన కలుగు కీడు ) కలుగును. అట్లు అంగ హీనమైన పుణ్య కార్యము వికలాంగు డైన నరుని వంటిది .వికలాంగు డెట్లు సర్వ కార్యములు చేయుటకు సమర్ధుడు కాడో ,అట్లే అంగ వైకల్యము గల పూజాది కర్మలు గూడ మంచి ఫలము లిచ్చుటలో సమర్ధములు కావు .అనగా నిష్పలము లగును.

 First   16 17 18 19  20  21  22  23  24  25  26  27  28  29  30  31 Last


No comments:

Post a Comment