Tuesday, February 11, 2014

శ్రీ బ్రహ్మాండ పురాణము13




ప్రజలనుండి ధనములు పుచ్చుకొనుచు వారి క్షేమము నాలోచింపక ,స్వేచ్చా ప్రవర్తునులై పరకాంతా ,పర ధనాపహరణముల పై ఆసక్తి చూపుదురు. మనుష్యులు విధి నిషేదములు లేక అభోజ్యము లైన వారిని గూడ తిని ,మధ మత్తులై యుండుదురు . మద్యపానము ,స్త్రీ వ్యసనము అధికముగా నుండును. శూద్రులు కాషాయ వస్త్రములు ధరించి సర్వ సంగ పరిత్యాగుల వలె ప్రజలకు కనిపించుచు ధర్మము లన్నియు తమకే తెలిసినట్లు ప్రజలకు భోధించుచు , అర్ధ కామాసక్తులై సంచరింతురు దొంగలు దొంగ తనమునకై పరుల ఇండ్లకు బోగా ,ఆ దొంగల యిండ్లలో మరొకడు దూరి ఉన్నవన్నియు అపహరించును. పాలకుడు (లేదా న్యాయమూర్తి ) నీతి మార్గమును అవలంబించి దండింప దగిన దోషిని దండించుటకు (శిక్షించుటకు) సిద్దపడినచో ,ఆ దోషి యేమాత్రమును భయము లేక న్యాయమూర్తి నే దండించి స్వేచ్చగా తప్పించు కొని పోవును .మానవులు తాము సర్వజ్ఞుల మనుకొనుచు వినయ వివేకములు లేక ,పెద్దలు చెప్పినది వినక స్వేచ్చా ప్రవృత్తి కలవారై సంచరింతురు. బద్దకస్తులు ఎక్కువై పోవుదురు. దానికి తోడు ఆశలు కూడా పెరిగి ,అధర్మ మార్గమున సంపాదించుటకు సిద్ద పడుదురు . కలియుగము చివరికి వచ్చునపుడు ఎలుకలు ,మహా సర్పములు పెచ్చు పెరిగి ,ప్రజలకు భయమును గలిగించును . ప్రజలకు క్షేమ ముండదు. బహు విధములైన రోగములు ప్రజలను పీడించును. మానసికమైన చింత లెక్కువగును. జనులు వీనితో చిక్కి శక్యము లగుదురు. వేద శాస్త్రములే ఆ ప్రజలకు భయపడి దూరముగా పోయినట్లు ,వాని వాసనలు గూడ కనిపించకుండా పోవును. శూద్రులు వేదములు చదివి ,అందరకును జ్ఞాన బోధ చేయుచు ,సకల ధర్మములను వివరింతురు . ధర్మములు నామమాత్రములై ఉండును. దుష్కృత్యముల చేత కొంతయు ,అధర్మ వర్తనము చేత కొంతయు, రోగముల చేత కొంతయు ఆయుర్దాయము తగ్గి పదునారు సంవత్సరాలకే జనులు మరణింతురు .
కిరాతకుడా మాటలు విని,"నన్ను ఆకారణముగా దూషించు చున్నావు. నేను కిరాతకుడను నా వారిని పోషించు కొనుటకై నేనీ మాంసమును సంపాదించి నాను. అవసరమైన దానికన్నా ఎక్కువ జంతువులను జంపినచో హింస యగును. ఈ మాంస భక్షణము మాకు బ్రహ్మ విధించిన యాహారము .దీనినే తప్పుగా భావించినచో నిన్నేమన వలెను. ? తండ్రి ఆదేశించి నాడని ,ముందు  వెనుకలు చూడక తల్లినే చంపినావు .నీవు పాపాత్ముడవా? లేక బ్రతుకుటకై మాంసాహారమును సంపాదించు కొను నేను పాపాత్ముడనా? ఎవరున్న చోటు పాప భూయిష్టముగా నుండునో యిప్పుడు చెప్పుము .నున్న చోటున నుండుటకు నీ కిష్టము లేనిచో, నిన్ను ఎరుగని వారుండు చోటికి పొమ్ము .తెలిసిన వారున్నచో నిన్ను మాతృ హంతకుడవని తిట్టుదురు" అని పలుకగా ,అతని మాటల తీరును బట్టి నిజముగా కిరాతకుడు కాడని యనుమానించి ,రాముడు చేతులు ముకుళించి యిట్లనెను . "అయ్యా ,నీవెవ్వడవో కాని నీ మాటలు కేవల కిరాతుని మాటలవలే లేవు . సాధారణ కిరాతకులకు ఇటువంటి తేజస్సు ఉండదు . నీవు దిక్పాలురలో ఒక్కదవో బ్రహ్మవో , విష్ణుమూర్తివో,లేక నేనుపాసించు చున్న త్రినేత్రుడవో చెప్పుము. నన్ననుగ్ర హించుటకు పరమేశ్వరుడే ఈ రూపమున వచ్చినట్లు నాకు దోచుచున్నది .ఓ శంకరా ! భక్తవ శంకరా ! నా యజ్ఞానమును మన్నించి నాకు ప్రసన్నుడవు గమ్ము .

No comments:

Post a Comment