దక్షిణా దేవి
శ్రీ కృష్ణుడు ఒక కార్తీక పూర్ణిమ నాడు గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను .ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను . ఆమెను జూచి శ్రీకృష్ణుడు ఒకసారి మనసుపడెను .ఆమెను అంగీకరించినది .వారిరువురు ను ప్రేమ పారవశ్యములో నుండుట రాధ గమనించెను . వెంటనే ఆమెను గోలోకము వదలి పొమ్మని యాజ్ఞాపించెను .దక్షిణ ,గోలోకము వదలి వైకుంటము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను .దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను. "దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా " అని శ్రుతి (యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి . ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి ,యజమానునకి చ్చును ) దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను . ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి . బ్రహ్మ కోరికపై విష్ణువు , లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను .ఆమెను తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను .యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.
బ్రహ్మ ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను . "యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును.దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును " అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.
" యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్ ,దురిష్టగ్ స్యాత్ " అని శ్రుతి (బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు ,అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి
శ్రీ కృష్ణావతారము
ఇరువది ఎనిమిదవ మహాయాగము ,అందులో ద్వాపర యుగము వచ్చెను. ఆ ద్వాపర యుగములో గూడ నాలుగవ పాదము జరుగు చున్నది .ఆ సమయములో ధర్మము చాలా వరకు క్షీణించినది . రాజులు చాలా మంది రాక్షసాంశలతో జన్మించి ప్రజా పీడ చేయసాగిరి .అది భరించ లేక భూదేవి వెళ్లి బ్రహ్మతో " ఈ భూమి యందలి ప్రజలు ,రాజులు అధర్మ వర్తనులై యున్నారు. వీరివల్ల భార మెక్కువై నేను భరించ లేకున్నాను .నా బాధను పోగొట్టు కొను ఉపాయము చెప్పు మనెను . ఆయన ,భూదేవిని ,మహేశ్వరుని ,నారాయణుని వెంట బెట్టుకుని గోలోకమునకు వెళ్లి , రాసమండలములో రాధతో విహరించుచున్న శ్రీ కృష్ణ పరమాత్ముని దర్శించి సాష్టాంగ ప్రణామములు చేసి యిట్లు స్తుతించెను .
No comments:
Post a Comment