Thursday, February 6, 2014

వైభవలక్ష్మీ పూజావిధానము6




పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి;
 ముఖే ఆచమనీయం సమర్పయామి; స్నపయామి; వస్త్రయుగ్మం సమర్పయామి;
 యజ్ఞోపవీతం సమర్పయామి; గంధం పరికల్పయామి;
 పుష్పాణి పూజయామి; దూపమాఘ్రాప యామి, దీపం దర్శయామి,
దూపదీపానంతరం
ఆచమమనీయం సమర్పయామి; నైవేద్యం సమర్పయామి;
 తాంబూలం సమర్పయామి; నీరాజనం దర్శయామి;
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
(అక్షతలు నీళ్ళు చేతిలో పోసుకొని)  అనయాధ్యానా వాహనాది షోడశోపచార
 పూజయా శ్రీమహాగణాదిపతి స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు
(అని నీటిని పళ్ళెములో  వదలవలెను)
 శ్రీ మహాగానాధిపతి ప్రసాదం శిరసా గృహ్నామి
(అని పూజ చేసిన అక్షతలు పుష్పములు తలపై ధరించ వలెను.)

అథ వైభవలక్ష్మి పూజాం గత్వేన కలశారధానం కరిష్యే |
కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య - కలశో పరి హస్తం నిధాయ
శ్లో || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
 మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతా:
 ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
 అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
   
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే , గోదావరి , సరస్వతి ,నర్మదా సింధు
 కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.||
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ మహా గణపతి
 (ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను )
 పూజార్ధం మమ దురిత క్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య
 (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ) ,
ఓం ఆత్మానం సంప్రోక్ష్యా అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి )
 ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి )
 కలశ మందలి నీటిని పై మంత్రం  చదువుతూ పువ్వుతో గాని ,
ఆకుతో గాని చల్లాలి .



No comments:

Post a Comment