ఒకడు తల్లి గర్భములోనే మరణించును .ఒకడు వయసులో నుండగా మరణించును ,మరొకడు ముసలితనములో చచ్చును. ప్రజలు దుష్ట సహవాసములతో దుష్కార్యములు చేయుదురు .బ్రాహ్మణులు విధి విధానములు తెలియక చేసినకర్మ దోషముల వలన చాలా అనర్ధములు ,భయములు కలుగును .అసత్యము లాడువారినే నెత్తిమీద పెట్టుకొందురు. అసూయ , ద్వేషములు సహజ గుణములగును. బ్రాహ్మణులు విధి విధానములు తెలియక చేసిన కర్మ దోషముల వలన చాలా అనర్ధములు ,భయములు కలుగును. అసత్యము లాడు వారినే నెత్తిమీద పెట్టుకొందురు. అసూయా ద్వేషములు సహజ గుణము లగును .బ్రాహ్మణులు వేదములు పటించరు. యజ్ఞములు కూడా చేయరు .క్షత్రియ వైశ్యులే కాక సర్వ వర్ణముల వారును తమ తమ ధర్మము లాచరింపరు.
ఒక విచిత్ర విషయము వినుడు .శూద్రాది వర్ణముల వారు చాలా అభివృద్దిలో నుండగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వారి యాశ్రమమున కై ప్రాకులాడుచు వారితో భోజనాదులు చేయుచుందురు . కుల భ్రష్టత్వమును గూర్చి యాలోచింపరు . పరిపాలకులు గూడ స్వార్ధమును గూర్చియే కాని ప్రజాక్షేమమును తలపరు. ఆయుర్దాయము నూరేండ్లు మాత్రమే యుండును . ధర్మ బుద్దికలవారు చాలా కొద్ది మంది యుందురు. వంశ మర్యాదలు ,శీలములు పూర్తిగా నశించును.బ్రాహ్మణులు శూద్రుల వలె ప్రవర్తింతురు .శూద్రులు బ్రాహ్మణులు చేయు పనులు బాగున్నవని చేయు చుందురు. రాజులే దొంగలుగా ప్రవర్తింతురు . సేవకులు స్వకృత్యములు మాని హీనమైన పనులు చేయుదురు . స్త్రీలు సత్యము ,ధర్మము విడిచి మధ్యము త్రాగుచు దుశ్శీలములు గలిగి ప్రవర్తింతురు .మాయా స్వభావములు కలిగి స్వేచ్చా విహారములు చేయుచుందురు .కలి పూర్తియగు నప్పటికి పతివ్రతలు అను వారుండరు .స్త్రీలు తలలు విరియ బోసికొని తిరుగు చుందురు . బ్రహ్మ చర్యాది ఆశ్రమ ధర్మములు చాలావరకు నశించును. రాజులు ,ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును హరించి ,తమ భార్యా పుత్రులకు ఇచ్చుచు సద్వ ర్తనము లేక యుందురు. బ్రాహ్మణుల శూద్రుల నాశ్రయించి జీవించుటే కాక వారికి పాదాభి వందనములు గూడ చేయుచుందురు. భోజన ప్రియులు ,దొంగలు అగువారు ,సన్యాసి వేషములతో తిరుగు చుందురు .వీరి సంఖ్య ఎక్కువగా నుండును .విప్రులు వేదములను అమ్ముకొని జీవింతురు . వీరు వారు అను భేదములు లేక అన్ని వర్ణముల వారు ను వాణిజ్యము చేసి జీవింతురు . మనుష్యులు శ్రమ బడి సంపాదించిన పుణ్యమును ఇహలోక భోగములకై అమ్ము కొందురు. (ఖర్చు చేయుదురు ) ఏ అధమ వృత్తిని చేపట్టి యైనను భార్యా పుత్రులను పోషించు కొనుటే ప్రధానమని భావింతురు . అతిధులు ,పండితులు ఇంటికి వచ్చినచో ఆతిధ్య మీయరు. చాలా మంది జనులు నాస్తికు లయ్యెదరు. స్త్రీల సంఖ్య వృద్దియై పురుషుల సంఖ్య తక్కువై వ్యభిచారములు పెరుగును .ఉపకారము చేసిన వారికే అపకారము చేయువారు బహుళ సంఖ్యలో నుందురు. పరమార్ధ మన్నచో ద్వేషము ప్రబలును. నగర పాలకులు పావన శీలములు విడిచి
No comments:
Post a Comment