Friday, February 14, 2014

శివ గీత26




సూతుడు చెప్పుచున్నాడు :
పిదప శ్రీరాముని ముందట అతిశయించు రత్నముల కాంతులతో
 నలువంకల ప్రకాశింప చేయు చతుశ్చక్రంబులున్నది,
ముత్యాల స్వచ్చమైన స్వర్ణ మయంబైన గిట్టలు గల యశ్వరాముల తోడ,
 నంది ద్వజముతోను, మదగజములు, పంచ తత్వములు,
పారిజాత పుష్పమాలల తోను, అగుర, కస్తూరి, జవ్వాది,
ఇత్యాది సుగంధ వస్తువులు కలది. ప్రళయ కాలములో గర్జించు మేఘ
 ధ్వని వలె నిఖిల వాయిద్యముల తోడను, కిన్రులు, కింపురుషు
లతో నిండినది యునగు దేదీప్యమానమగు రధము గన పడెను.

ఏవం కృత్వా రాధా శ్రేష్టం - వృషాదుత్తీర్య శంకరః,
అంబయా సమిత స్తత్ర - పటతల్పే విశత్తదా 7
సుర నీర జనే త్రాణాం - శ్వేత చామర చాలనై:
దివ్య వ్యజన వాతైశ్చ - ప్రహృష్టో నీల లోహితః 8
శంకరుడీ లాంటి రధమును కల్పించి ఉమా సహితుడై నంది
వాహనము నుండి దిగి యా రధము నందలి వీలు శయ్యను ప్రవేశించెను.
దేవతాస్త్రీలు వీచే వింజామరములకు,సుఖముగా వీచెడు వాయువునకు
 పార్వతీ పతి యానందించిన వాడయ్యెను.

క్వణ త్కంక న నిద్వానై - ర్మంజు మంజీర శింజితై:,
వీణా వేణు స్వనై ర్గితై: - పూర్ణ మాసీ జ్జగత్త్రయమ్ 9
శుక వాక్య కలారావై - శ్శ్వేత పారావత స్వనై:,
ఉన్నిద్ర భూష ఫణి నా - దర్శ నాదేవ బర్హణః 10
నినదించు కర కంకణాల ధ్వని చేత, మనోహరములై చిన్న గజ్జెల ద్వనులతోడ,
 వీణా వేణు రావములతోడ ను ,పారావత విరావముల తోడను,
 చిలుక పలుకల తోను జగము వ్యాపించెను .
శివుని యాభరణము లైన సర్పములను చూచి మయూరములు
 తమ పురుగులనే అసంఖ్యాఖము లుగా నములుతూ
 నాట్యము చేసినవి.

ననృ తుర్దంశ యంత స్స్వాం -శ్చంద్ర కాన్కోటి సంఖ్యయా,
ప్రణ మంతం తతో రామ - ముత్దాప్య వృష భ ద్వజః 11
అనినాయ రధం దివ్యం - ఫ్రుష్టే నాంత రాత్మనా,
కమండలు జలై స్స్వచ్చై - స్స్వయ మాచమ్య యత్నతః 12
తమా చామ్యాధ పురత -స్స్వాం కే రామ ముపానయత్,
అధ దివ్యం ధను స్తస్మై - దదౌ తూణీ ర మక్షయమ్ 13



First 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Last

No comments:

Post a Comment