Friday, February 21, 2014

శివ గీత30




నిరస్త్రే ష్వల్ప శస్త్రేషు పలాయన పరేషుచ 37
అస్త్రాణి ముంచ న్దివ్యాని - స్వయమేవ వినశ్యతి ,
అధ వాకిం బహూక్తేన - మయైవో త్పాదితం జగత్ 38
మయైవ పాల్యతే నిత్యం - మయా సంహ్రియతే సిచ,
అః మేకో జగన్మ్రుత్యు - ర్మ్రుత్యో రపి మమీ పతే! 39
గ్రసే హమేవ సకలం - జగదేత చ్చరాచరమ్,
మమ వక్త్ర గతా స్సర్వే - రాక్షసా యుద్ద దుర్మదా: 40
నిమిత్త మాత్ర స్త్వం భూయా: -కీర్తి మాస్స్యాసి సంగరే,
                        ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం పంచమోధ్యాయః
వనచరులు అనేకములైన గొప్ప గొప్ప రాతి గుండ్లతో సముద్రమునకు
 వంతెన గట్టి నీతో బాటు లంకకు వచ్చెదరు.
నీవు బృత్య బంధము మిత్రుల సమూహముతోడ గలసి లంకాధి
 పతి హత మార్చి ప్రియురాలగు సీతను తీసుకొని రమ్ము
సామాన్య శస్త్రములతో నే రణ రంగములో విజయము లభించు
చుండగ అక్కడ మహాస్త్రములను ప్రయోగింప కూడదు.
 శత్రువులు పరుగెత్తు చుండగను ఆయుధాలు లేని వారైనను,
కొద్ది మాత్ర శస్త్రములున్న వారైనను అట్టి వారిపై అస్త్రముల
 ప్రయోగించిన యెడల ప్రయోగించిన వాడే వినాశనమునకు
గురి యగును. పైన పేర్కొనిన వారిపై మహాస్త్రములను ప్రయోగింప వలదు .
 వేయేల, ఈ జగత్తంత యును నాతోనే సృష్టించ బడినది,
 నా చేతనే రక్షించ బడినది.
నా చేతనే సంహరింప బడినది, నేనే మృత్యువునకు కూడా మృత్యువును,
 సమస్త స్థిర చరాత్మక ప్రపంచ మంతయును మ్రింగెదను.
 (అత్ర అనేన హేతునా లీయతే గమ్యతే యత్ర సచ రాచరం
తల్లింగ మితి జంజ్నితమ్ ) రణమందు మదించిన రాక్షసులందరు
 నా నోట బడని వారలే . నిమిత్తమునకు మా తరము నీ వుండుము.
శాశ్వతమైన అపారమగు యశస్సును నీవు పొందగలవు.
       ఇది వ్యాసోక్త సంస్కృత పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో
 ఐదవ అధ్యాయము సమాప్తము.

షష్ట మాధ్యాయము
విభూతి యోగము
శ్రీరామ ఉవాచ : -
భగవం స్తత్రమే చిత్రం - మహాదేత త్ప్రజాయతే,
శుద్ధ స్పటిక సంకాశ - స్తినేత్ర శ్చంద్ర శేఖర: 1
మూర్త స్త్వంతు పరిచ్చిన్నా - కృతి: పురుష రూప దృత్,
అమ్బయా సహితో త్రైవ - రమసే ప్రమధై స్సహా 2
త్వం కధం పంచ భూతాది - జగదేత చ్చరా చరమ్,
తద్బ్రూహి గిరిజా కాంత! - యది తేను గ్రహొ మయి 3



First 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Last

No comments:

Post a Comment