వైభవలక్ష్మి వర్ణన:
ప్రకృతి మాతా, జగన్మాత, ఆదిలక్ష్మి, మహామాత, బ్రహ్మాది దేవతలచే పూజింపబడుచున్నది.
వికసిత పద్మాసనయై, తన పైరెండు హస్తములలో మనోహరమైన ఎర్రని తామర పుష్పాలను
ధరించినది అధో భాగమున రెండు హస్తములలో ఒక హస్తము ధనము,
మరో హస్తమున అభయముద్రా కలిగియున్నది.
అట్టి వైభవలక్ష్మికి
నమస్కరిస్తున్నాను. సర్వలోకరక్షణీ, సర్వజ్ఞాన ప్రదాయినీ,
సకల సంపద్బ్రదాయినీ, సద్బద్ది ప్రదాయినీ, మంత్రసిద్ధి ప్రదాయినీ,
యోగశక్తి ప్రదాయినీ దయామయీ, విష్ణు వక్షః స్థల స్థాయినీ
అయిన వైభవలక్ష్మికి నమస్కరిస్తున్నాను.
శ్రీ హరి హృదయనివాసిని, క్షీర సముద్ర రాజతనయా, శ్రీరంగా ధామేశ్వరీ,
సహస్రకోటి ద్యుల్లతా సమతేజస్విని, శ్వేతవస్త్రధారిణీ, శ్వేత పుష్పాలంకృత
సద్గుణా అయిన భాగ్యలక్ష్మికి
శతకోటి వందనాలు అర్పిస్తున్నాను.
వైభవలక్ష్మి పూజాకథ
వైభవలక్ష్మి రామా, విద్యా, హరివల్లభా, లక్ష్మీ, క్షీర సముద్ర రాజతనయా,
సంపత్ప్రదాయినీ, శ్రీ చక్ర వాసినీ, యోగినీ, మహాప్రక్రుతి స్వరూపిణీ,
జగద్రక్షణీ మున్నుగాగల నామములతో వర్ణింపబడినది.
శ్రీ సూక్తమున (శ్రీమన్మహా)
వైభవలక్ష్మి హిరణ్య హరిణి,
సువర్ణ రజత స్రజా అని పేర్కొనబడినది.
లక్ష్మి స్తోత్రమ్
శ్రీమన్మ హాలక్ష్మ్యై నమః
బ్రాహ్మీంచ వైష్ణవీ భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖాం
త్రినేత్రాం చ త్రిశూలం చ పద్మ చక్ర గదాధరామ్
ప్రథమే త్ర్యంబకాగౌరీ ద్వితీయే వైష్ణవీ తథా
తృతీయే కమలాప్రోక్తా, చతుర్దే లోకసుందరీ
పంచమే విష్ణుపత్నీచ, షష్టే చ వైష్ణవీ తథా
సప్తమే చ వరారోహా అష్టమే వరదాయినీ
No comments:
Post a Comment