Friday, February 7, 2014

శ్రీ కూర్మ పురాణము5






ప్రహ్రాదుడు తండ్రి యొద్దకు వెళ్లి " నీ వాతనితో యుద్దము మాని శరణు వేడుము .అతడు భగవంతుడు .అతనితో యుద్దము మనకే హానికరము " అని భోధించెను .కాని తండ్రి వినలేదు . యుద్దము చేయుటకు బయలుదేరెను. సమరములో నరసింహుడు హిరణ్య కశిపుని సంహరించెను . నృసింహుని శరీరము నుండి పుట్టిన సింహములు , ప్రహ్రాదుని సోదరులను సైన్యములను జంపి రూపు మాపెను. ఎందుకో గాని హిరణ్యాక్షుడు గాని అతని కొడుకు అంధకుడు గాని నరసింహుని ఎదుట నిలుచుటకు సాహసించ లేదు. అందుచేత బ్రతికి పోయిరి .
తన తండ్రి చనిపోయిన తరువాత ప్రహ్రాదుడు ,పిన తండ్రి హిరణ్యాక్షునికి పట్టాభిషేకము చేసెను. అతడు రాజ్యపాలన చేయుచు దేవతలకు ,ఋషులకు ,మానవులకు చాలా బాధ కలిగించు చుండెను.
అతడొకసారి భూమండల నివాసుల మీదను ,భూమి మీదను కోపించి భూమిని చుట్టగా చుట్టి , పాతాళ మంటునట్లు సముద్రములో ముంచివేసెను. భూమి మీది ప్రజలును ,భూదేవియు హాహాకారములు చేసి విష్ణు భగవానుని ప్రార్ధించిరి. వారి ప్రార్ధన లాలకించి భగవానుడు శ్వేత వరాహ రూపము ధరించి హిరాణ్యాక్షుని సంహరించి భూమిని తన కోరల మీద పైకెత్తెను. దానితో హిరణ్యాక్షుని పీడ విరుగుడయ్యెను.

First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last


No comments:

Post a Comment