ఈ మాయానాటకములో నా ద్వార పాలకులు జయ విజయులు ముఖ్య సూత్రములు, నేను సూత్ర ధారుడను.
ఒక నిమిత్తము చేత జయ విజయులు శాప మొంది మూడు జన్మములో రాక్షసులుగా జన్మింతురు. మొదట హిరణ్యక శివు హిరణ్యాక్షులుగా పుట్టుదురు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. అతడు నా భక్తుడు. అతడు పూర్వజన్మములో ధర్మవత్సలుడను బ్రాహ్మనుడు. మహా విద్వాంసుడు. ఒక రాజున కాస్థాన విద్వాంసుడు. హరి భక్తి ప్రభోధము చెయుచుండువాడు. ఒకనాడు కర్మకాండలందు ఆసక్తుడైన ధర్మబంధుడను ముని, యజ్ఞాది కర్మములే గొప్పవనియు, తక్కినవి పరమార్ధ సాధనములు కావనియు ధర్మవత్సలునితో వాదించెను. వాదోపవాదములు తీవ్రముగా సాగినవి. భక్తియే పరమార్ధమని ధర్మవత్సలుడు నిరూపించి జయము పొందెను. ధర్మబంధుడు ఆగ్రహముతో ధర్మవత్సలుని రాక్షసుడవుగా పట్టుమని శపించెను. తరువాత పాశ్చాత్తాప మొంది రాక్షసుడ వైనను హరిభక్తి గలిగియందు వని పలికెను. ఆ శాపమువలన బుట్టిన వాడే ప్రహ్లాదుడు.
త్రేతాయుగములో రావణ కుంభకర్ణులు జన్మించినపుడు ఇతడు విభీషణుడై జన్మించెను. ద్వాపరములో శిశుపాల దంత వక్త్రులు పుట్టిన పుడితడు ధర్మభోధ చేయుటకు సహదేవుడుగా పుట్టును. నేనా రాక్షసులను వరాహ, నరసింహ, రామ, కృష్ణావతారము లెత్తి సంహరించెదను". ఇవన్నియు విన్న సనక సనంద నాదులు మాధవుని మయాలీలలు అనూహ్యములు అని పొగడుచు సెలవు తీసికొనిరి.
కొంతకాల మిట్లు గడచెను.ఒక నాడు సనకాదులు వైకుంఠమునకు విష్ణు దర్శనార్ధము వచ్చిరి. జయవిజయులు వారి నడ్డ గించిరి. "క్షేమము, అభయము నిచ్చెడి యీ వైకుంఠ ధామమున మీ ద్వార పాలకత్వము కేవలము అలంకార ప్రాయము. మీ రిక్కడ నుండి ప్రయోజన మేమి? భూలోకమున రాక్షసులై జన్మింపు" డని వారిని శపించిరి.
శ్రీనాధుడక్కడ ప్రత్యక్షమై, సనకాదులతో "మీ వాక్యానుసారమే వీరు భూలోక చక్రమున మూడు మారులు రాక్షసులై జన్మించెదరు" అని చెప్పెను.
అట్లే జయవిజయులుదితి గర్భమున హిరణ్య కశిపుడుగాను, హిరణ్యాక్షుడుగాను జనించిరి. వారు పైకి ఆ పరమాత్ముని తిరస్కరించినట్లు ఎన్నో అకృత్యములు చేసిరి. భూమికే ఉపద్రవము తలపెట్టిన హిరణ్యాక్షుని శ్రీపతి వరాహ రూప మెత్తి సంహరించెను. తన తమ్ముని జంపినాడని, హిరణ్యక శివుడు విష్ణువు పై ద్వేషము వహించినట్లు నటించి అతనికై వెదకి యెచ్చటను గానక విసిగి పోయెను.
No comments:
Post a Comment