రామశర్మ ఇచ్చిన
సమాదానములకు సంతృప్తి నొంది ఆతుర సన్యాసము ఇచ్చుటకు అంగీకరించి ,ఉపదేశము చేసెను. (ఆతుర సన్యాసమనగా అత్యవసర మైన వేల గాని, మరణించుటకు కొంచెము
ముందుగాని త్వర పడి తీసికొను సన్యాసము ).
వెంటనే రామశర్మ విశ్వనాధాలయమునకు వెళ్లి ,విశ్వనాధా ! సన్యాసము మరియొక జన్మమని శాస్త్రములు చెప్పుచున్నవి గదా ! నేను ఆతుర సన్యాసము స్వీకరించి ఇంకొక జన్మమెత్తి వచ్చినాను .నన్ను చక్రవర్తిగా జేయుదు నన్నావు గదా ! నాకు వెంటనే ఆ వరము నిమ్ము " అని నిష్కర్ష చేయగా విశ్వనాధు డిట్లనెను ."ఓయీ ,నీవు నన్ను బెదరించి బలాత్కారముగా వరమును పొందుచున్నావు. ఏమైనను నేను మాట తప్పెడి వాడను గాను .నీవు దండక మండములను కాషాయ వస్త్రములను గంగా నదిలో పారవేసి గంగా ప్రవాహమునకు ఎదురుగా కొంత దూరము నడచి పొమ్ము . అక్కడ నొక వట వృక్షము కనిపించును .దాని క్రింద నన్ను తలచు కొనుచు కూర్చుండుము .అదే నీకు రాజ యోగము పట్టుటకు కారణమగును " అని చెప్పగా రామ శర్మ పరమేశ్వరుడు చెప్పినట్లు అన్నియు గంగలో పారవైచి ,దాని తీరము వెంబడినడచి వట వృక్షము చేరి దాని క్రింద ఆసీనుడై విశ్వనాధుని ధ్యానించు చుండెను.
రామ శర్మ యవనులకు రాజగుట
గంగానదికి కొంత దూరములో ఒక మహమ్మదీయ రాజ్యము కలదు .ఆ రాజ్యమును పాలించు వారిని సుల్తానులు అని చెప్పుట ఆచారముగా నుండెను . అచట ఒక సంప్రదాయ ముండెను . ఏ సుల్తానైనను వారసులు పుట్టకుండగానే మరణించి నచో అతని తరువాత రాజ్యము పాలించుటకు ,పట్టపు టేనుగు నలంక రించి దాని తొండమునకు ఒక పూలమాలిక నిచ్చి ,అది ఎవని కంటమున వేయునో వానినే తమ సుల్తానుగా అంగీకరించి పట్టాభిషేకము చేయుదురు. వంద సంవత్సరముల క్రిందట ఒకసారి ఇట్టి ఎన్నిక జరిగినది . ఇపుడు గూడా సంతానము గాని వారసులు గాని లేకుండగానే సుల్తాను మరణించెను. మంత్రి సామంత దండ నాదాదులు పుర ప్రముఖులతో పెద్ద సభ చేసి తమ సంప్రదాయమును గురించి చర్చించి ,పట్టపు టేనుగును అలంకరించి దాని తొండమునకు పూల దండ నిచ్చి ,'ఓ గజరాజా ! మాకు కాబోవు సుల్తానును ఎన్నిక చేసి సమర్ధుడైన పరిపాలకుని నిర్ణయింపుము .అని ప్రార్ధించి విడిచిరి .అందరును ఏనుగు తమకు పూలమాల వేయునని ఆత్రముగా ఎదురుచూచిరి .ఆ గజరాజు వారి నెవ్వరిని కన్నెత్తి చూడక తిన్నగా బోవుచుండెను. రాజోద్యోగులను ,పరివారమును దాని వెంట నడచు చుండిరి .అది చాలాదూరము నడచి చివరికి గంగా నదీ తీరమునకు వచ్చి అక్కడ వట వృక్షము నీడలో గూర్చుండి దైవ ధ్యానము చేయుచున్న రామశర్మను జూచి తొండము ఎత్తి ఘీంకారము చేసి పూల దండను అతని మెడలో వేసి ,తొండముతో అతనిని వీపుమీద నెక్కించుకొని తమ నగరము వైపు నడచెను. ప్రజలును ,పరివారమును తమ సుల్తానునకు జయ జయ ద్వానములు చేయుచు ఏనుగు వెంట నగరమునకు బోయి రామశర్మ ను సింహాసనమున

No comments:
Post a Comment