Wednesday, February 12, 2014

శివ గీత21






రౌద్రం పాశుపతం బ్రాహ్మం - కౌబేరం కులిశా నిలమ్,
భార్గవాది బహున్యప్త్రా - ణ్యయం ప్రాయుజ్క్త రాఘవః 17
తస్మిం స్తే జపి శస్త్రాణి - చాస్త్రాణ్య స్య మహీ పతే;,
విలీ నాని మహాభ్రస్య - కరకా ఇవ నీ రధౌ 18
తతః క్షణేన జజ్వాల - ధనుస్త స్య కారా చ్చ్యుతమ్,
తూణీ రం చాంగుళీ త్రాణం - గోది కాపి మహీ పతే: 19
శ్రీరాముడు వదలిన మహాస్త్రము లన్ని ఆ గొప్ప తేజస్సులో
మహా సముద్ర మనబడిన వడ గండ్ల మాదిరి కరిగి పోయినట్లుగా
 లీనము లైన ఆ మీదట తృటి కాలములో
శ్రీ రామ చంద్రుని ధనస్సు కూడా జారి (క్రింద నేలపై )
 బడి భస్మ మైనది ,(బూడిద ) మరియు అమ్ముల పొదియు,
 హస్త కవచము ,గోదికము నేలపై బడి దగ్ధమైనవి.
తద్ద్రుష్ట్యా లక్ష్మణో భితై- పపాత భువి మూర్చితః,

అధాకిం చిత్కరో  రామో - జానుభ్యా మవనిం గతః 20
మీలితాక్షో భయా విష్ట -శ్శంకరం శరణం గతః,
స్వరేణా ప్యుచ్చ రన్నుచ్చై - శ్శంభో ర్నామ సహస్రకమ్ 21
శివంచ దండవ ద్భూమౌ - ప్రణ నామ పునః పునః,
పునశ్చ పూర్వ వచ్చాసీ - చ్చబ్దో దిజ్మండలం స్వనన్ 22
చచాల వసుధా ఘోరం - పర్వతాశ్చ చ కంపిరే,
అధ క్షణేన శీతాంశు - శ్శీతలం తేజ ఆదదత్ 23
ఉన్మీలి తాక్షో రామస్తు - యావద్యా వత్ప్ర పశ్యతి,
తావద్ద దర్శ వృషభం - సర్వాలంకార సంయుతమ్ 24
పీయూష మధనో ద్భూత - నవనీత స్య పిండ వత్,
ప్రోత స్వర్ణం మరకత - చ్చాయా శృంగ ద్వాయాంచితమ్ 25
నీల రత్నేక్షణం - హ్రస్వ - కంట కంబల భూషితమ్,
రత్న పల్యాణ సంయుక్తం -నిబద్దం శ్వేత చామరై: 26
అది గాంచి సౌమిత్రి లక్ష్మణుడు భయపడి నేలబడి మూర్చిల్లెను.
తరువాత శ్రీరాముడు దిగ్భ్రాంతుడై యేమియు తోచక భూమిపై
మొకాళ్ళూని(మోకరిల్లి ) భయకంపితుడై కనులు మూసికొని
ఉమాపతే నన్ను కాపాడు వాడని యెంచి గొంతెత్తి గట్టిగా
వేద సార శివ సహస్రనామములను పటించుచు ముమ్మాటికి దీర్ఘ
దండ నమస్కారములు సల్పెను.

No comments:

Post a Comment