Thursday, February 13, 2014

శ్రీ నారద పూరాణము13




"ఒక్కసారి కృష్ణునకు నమస్కరించినచో నూ రశ్వమేధ యాగముల ఫలము గలుగును. అయితే, నూ రశ్వమేధ యాగములు చేసిన వాడు పుణ్యము క్షీణించినచో తిరిగి జన్మము లెత్తును. కృష్ణుని నమస్కరించిన వాని పుణ్య మనంతమై తిరిగి జన్మము లెత్తడు" అని పురాణములు ఘోషించుచున్నవి. ఏకాదశీ వ్రత ప్రభావమున వైకుంఠ మునకు బోవుచున్నారన్నచో ఇంక వింత యేమున్నది? ఇట్లు ఆక్షేపించినందుకు విష్ణుదూతలు నిన్నేమియు చేయనందుకు సంతోషింపుము. భక్తులను పవాసములు మాన్పి పాపులను జేయుట నాకు గూడ శక్యము గాదు. పైగా విష్ణు భక్తులకు హాని పాపులను జేయుట నాకు గూడ శక్యము గాదు. పైగా విష్ణుభక్తులకు హాని తలపెట్టినచో అది తిరిగి మననే దెబ్బతీయును. నీ వింక నీ యింటికి బొమ్మ" అనగా యముడు, "దేవా! బ్రహ్మ హత్యాది మహాపాతకములు చేసిన వారు గూడ యీ వ్రతము వలన ముక్తి నొందుచున్నారు. ఇంక శిక్షా శాస్త్రమునకు విలువ యేమున్నది? నాకు పనియేమున్నది? ఆలోచించి దీనికొక యుపాయము చెప్పు"మని ప్రార్ధించెను. దేవతలు గూడ యముని వాదమును బల పరచిరి. అపుడు బ్రహ్మ తన సంకల్పముతో ఒక పత్రికను సృష్టించెను. ఆమెను జూచి దేవతలే మతులు పోగొట్టుకొనిరి. ఆమె బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! నన్నేల సృష్టించితివి? నా పేరేమి ? నేనేమి చేయవలెను?" అని అడిగెను. బ్రహ్మ,"నీ పేరు మోహిని. భూలోకములో రుక్మాంగదడను రాజున్నాడు. అతడే కాదశీ వ్రతనిష్టుడు. నీ వాతనిని మోహింపజేసి యా వ్రతమును మానిపించవలెను. అతడు మందర పర్వత ప్రాంతమునకు వేటకు వచ్చును. అప్పుడు తనిని లోబరచుకొని, ఈ దేవ కార్యమును నెరవేర్చు" మని చెప్పగా, ఆమె మందర పర్వతమునకు బోయి రుక్మాంగదుని కొరకు నిరీక్షించుచుండెను.
   
రుక్మాంగదునకు సంధ్యావలి యందు ధర్మాంగదుడను పుత్రుడు కలిగెను. అతడు నిజముగా ధర్మాంగదుడే (ధర్మమే ఆభరణముగా గలవాడు). శ్రీరామునివలె పితృవాక్య పరి పాలకుడు. చిన్నతనములోనే సకల విద్యాపరి పూర్ణుడై, యౌవ రాజ్యమును పొందెను. తండ్రి పెండ్లి యాడిన యితర భార్యలను (సవతి తల్లులను) గూడ కన్న తల్లుల వలె గౌరవించెడివాడు. ఇట్లున్న తన కుమారుని జూచి రుక్మాంగదు డానందించి ఒకనాడ తనిని బిలిచి, "నిన్ను రాజుగా అభిషేకించెదను. యోగ్యుడైన కుమారు డుండగా రాజ్యము వాని కిచ్చి నేను మృగయాది వినోదములతో విశ్రాంతిగా కాలము గడపుద మనుకొనుచున్నాను.  
దీనికి వంగీకరింపు"మని బడంబరచి, సంధ్యావళికి చెప్పి ధర్మంగదునికి పట్టాభిషేకము చేసెను. కొడుకుతో ఇట్లునెను. "నేను ప్రజలందరిని కన్నబిడ్డల వలె చూచినాను. వారందరిని ఏకాదశీ వ్రతములు చేయునట్లు శాసించినాను. నీవును ధర్మముగా ప్రజలను బాలించుచు ఏకాదశీ వ్రతమును కొనసాగించు చుండుము"అని బోధించెను.   

సంధ్యావళిని బిలిచి," నేను వేటకై అరణ్యమునకు పోయి వచ్చెద"ననగా ఆమె, "స్వామీ! మీవంట ధర్మాత్ములకు జీవ హింస పనికిరా"దని పలుకగానతడు, "దేవీ! నాకు మృగములను చంపుటలో వ్యసనము లేదు. అడవిలో నున్నమునులకు ఆ పదలు కలిగించి దుష్ట జంతువులను జంపి క్షేమము కలిగించుటయే నా యాశయము" అనగా

First  2  3  4   5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last


No comments:

Post a Comment