Thursday, February 6, 2014

వైభవలక్ష్మీ పూజావిధానము14


ఆరతి పాట
ఆరతు లివిగో నమ్మ వైభవలక్ష్మి
మమ్మేలు మాతల్లి మంగళ రూపిణీ
పాల సంద్రములోన వెలసిన శ్రీలక్ష్మి
మంజుల భాషిణి శీమన్మహాలక్ష్మి
విద్యాప్రదాయిని విలసిత హృదయాని
దారిద్ర్య దూరిణి ధన ప్రదాయినీ
అజ్ఞాన తిమిర యు నణచేటి ఆదిలక్ష్మి
ఆరతు లివిగో అందుకొనవమ్మా   !
ఆది పరాశక్తి అఖిలాండేశ్వరీ
ఆగమరూపిణి అభయ ప్రదాయిని
దానవ శిక్షిణి మానవ రక్షిణి
స్త్రీ జన రక్షిణి శ్రీమహాలక్ష్మి
మము బ్రోవు మమ్మ మహాలక్ష్మి
సిరి సంపదల నొసగనమ్మ శ్రీలక్ష్మి
భోగభాగ్యాల నీయనమ్మ భూలక్ష్మి
మమతల పెంచమమ్మ మమ్మేలు మాలక్ష్మి !

మంత్ర పుష్పం
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్ర్యైలోక్య  కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్
శుద్ధ లక్ష్మీ ర్మోక్షలక్ష్మి ర్జయలక్ష్మి: సరస్వతీ
శ్రీలక్ష్మి ర్వరలక్ష్మిశ్చ  ప్రసన్నా మమ సర్వదా
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి! నారాయణి నమోస్తుతే ||
శ్రీ వైభవలక్ష్మి నమః మంత్రపుష్పం సమర్పయామి
(అక్షతలను దేవిపాదముల వద్ద ఉంచవలెను.)
(అవసరమైతే పునః పూజ చేసికొనవచ్చును )

పునః పూజా
సరసిజనయనే సరోజహస్తే నళినదళాంశుక గంధ మాల్య సేవే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్
కర్పూర నీరాజనం - ఆచమనం - పునః పూజాం సమర్పయామి.
పూర్ణ ఫలప్రసాదం సమర్పయామి
(కొబ్బరి కాయను పగులగొట్టి దేవికి నైవేద్యం పెట్టవలెను.)



No comments:

Post a Comment