Wednesday, February 5, 2014

శ్రీ నారద పూరాణము19




సభ జరిగెను. ప్రహ్లాదుడు శ్రీనాధుని ధ్యానించి ఒక ప్రక్కనిలిచెను. మహర్షు లందరును ఒక ప్రక్క నిలిచిరి. పాషండ మతస్థులతో ఒక దినము, మరొకనాడు బౌద్దులతోను, ఇంకొకనాడు జైనులతోను, ఇట్లు ఒక్కొక్క   నాడొక్కొక్కరితొ వాదించెను. చార్వాకులపై, కాపిలుల పై, కాణాదుల పై మొత్త మందరిపై తన వాద బలముతో విజ్రుంభించగా వారు వాదించుటకై యక్తులుతో చక అవాక్కులైరి.
   హిరణ్యక శిపుడు కుమారుని వాద పటిమకులో లోన ఆనందపడుచు, పైకి కోపము నటించగా ప్రహ్లాదుడు" తండ్రీ! వేదమును మించిన ప్రమాణము లేదు. శ్రీమన్నారాయణుని మించిన భగవానుడు లేడు. అతనిని సేవించి ధ్రువుడు మున్నగువారు శాశ్వత స్థితిని సంపాదించిరి. లోకము లన్నియు శ్రీ హరి సంకల్ప బలమున నడచుచున్నవి. మన యీ ప్రవృత్తు లన్నియు అతని శక్తి చేతనే సాగుచున్నవి. అది గ్రహించి నడుపుము. కృతఘ్నుడవు కాకుము. తండ్రీ యైనను గురు వైనను పాము నోటిలో చేయి పెట్టుచున్నచో నివారింపవలయున గదా! అందుకే న్యాయమార్గమును చెప్పితిని. నా అపరాధమును మన్నింపు"మని తండ్రి పాదముల పై వ్రాలెను.   
అంతట రాక్షస రాజు, "ఏ మైనను మన రాక్ష సపక్షమును విడిచి, శ్రీ హరి పక్షమున మాటలాడుట నీకు ఉచితము కాదు. దేవతలలో విష్ణు వనెడి   మాయలాడు ఉన్నాడని విని వాని కై వెదకినాను. నాకు జడిసి వాడెక్కడికి పోయెనో కాని కనబడలేదు. అందుచేత నేనే సర్వాధి పతిని. నా కన్న గొప్పవాడు లేడు. సింహ జాతిలో బుట్టి లేళ్ళమందలో గలిసెద నందువేమి?"అని పలుకగా ప్రహ్లాదుడు శ్రీ హరి పారమ్యమును (ఘనతను) మరల వర్ణించెను. దానితో రాక్షస రాజు మండిపడి "ఆకాశ కుసుమము యొక్క సువాసనను ఆఘ్రాణించినట్లు నిర్విషయుడైన (నామరూపములు లేని) శ్రీనాధుని రక్షకుడిని స్తుతించెద వేమి? సూక్ష్మ దృష్టి గలిగిన మేమే అతనిని చూడలేక పోయితిమి.బాలుడవు, నీ వేమి చూచి యిట్లు మాట్లాడు చున్నావు? హరి భక్తి మాననిచో నిన్ను దండింతు" ననుచు చిందులు ద్రొక్కెను.  
కొంతకాల మిట్లు గడచెను. ప్రహ్లాదునకు యుక్త వయస్సు వచ్చెను. వయసుతో పాటు జ్ఞానము పెరిగి పరబ్రహ్మ సాక్షాత్కారము గలిగెను.
     ఒకనాడు, రాక్షస రాజు ప్రహ్లాదుని జూచి వెట కారముగా "నాయనా! నీకు పట్టాభిషేకము చేసెదను. నీవు రాక్షస రాజు వైనచో నెనును సర్వరాక్షసులును ఆనందించెదము"అనగా, ప్రహ్లాదుడు "రాజ్య సంపదలు జ్ఞానికి అనవసర మనియు, విష్ణు సేవా సామ్రాజ్యమే తనకు ఆనందము కలిగించు" ననియు పలుకగా రాజు చాల కోపించి భటులతో వీనిని కత్తులతో నరకుడని యాజ్ఞాపించెను. వారు నరకబోగా కత్తులు చూర్ణము లయ్యెను. తరువాత పాములచే కరిపించెను. ఆ పాములు, కోరలు విరిగి నీరస పడెను. దిగ్గ జములను బిలిచి వానిచేత క్రుమ్మించెను.తొండములు, దంతములు విరిగి అవి వెనుకకు బారి పోయెను. పెద్ద పెద్ద మంటలలో త్రోపించెను. శ్రీ హరి స్మరణ ప్రభావము చేత తల వెండ్రుక కూడ కాలక ప్రహ్లాదుడు మేలిమి బంగారమువలె మెరసెను. ఇది పని కాదని అతడు తినెడి పదార్ధములలో కాలకూట విషము కలిపించి పెట్టెను.

First  2  3  4   5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last

No comments:

Post a Comment