Thursday, February 13, 2014

మార్కేండేయ పూరాణము 7




ముఖ్యముగా
రాజు కామక్రోధ లోభమోహమద మాత్సర్యములనెడి అరి షడ్వర్గ మునకు వశుడై
యుండరాదు. ఇంద్రియని గ్రహము గలవానికి ఎచ్చటను అపజయము ఉండదు. ఈతి బాధలు
(ఎలకలు, చిలుకలు, మిడతలు మన్నగు బాధలు లేకుండ ప్రజాపరి పాలనము చేయుట రాజు
యొక్క కర్తవ్యము)   

ఈతిబాధలు
" అతి వృష్టి రానావృష్టి: మూషికా శ్శ లాభాశ్శుకాః,
అత్యాసన్నాశ్చ రాజానః షడేతా ఈత యస్స్రతాః"
(అతివృష్టి, అనావృష్టి, ఎలకలు, చిలుకలు, మిడతలు, రాజులు అతి సమీపములో ఉండుట అనునవి ఆరును ఈతిబాధలు)

పూర్వము కొందరు మరుత్తు మున్నగువారు కామక్రోధాదులకు వశులై ప్రజా రంజకులు కాలేక పతనమైరి. అందుచేత రాజైన వానికీ నియమములు ఉండవలెను.   

ఇంద్రుడు
భూలోకమున వర్షములు కురిపించి, సన్యములు వృద్ది చేసి, ప్రజలు చేయు యజ్ఞ
యాగాదుల వలన తాను గూడ తృప్తి పొందును. అట్లే రాజుగూడ ప్రజలకు అవసరమైన
సౌకర్యములు సమకూర్చి వారి వలన పన్నులు గ్రహించి,  ఆదరణమును పొందవలెను.
పన్నులుగూడ ప్రజలను బాధించునవిగా ఉండరాదు. సూర్యుడు ఏడెనిమిది మాసములు మహీ
మండలముమీద నున్న నీటిని కిరణములతో పీల్చును. ఆ పీల్చిన నీటిని నాలుగుమాసముల
పాటు   వర్షము రూపమున భూమండలమునకు అందించును. అట్లే రాజు ప్రజలకు బాధ
లేకుండ పన్నులు గ్రహించి తిరిగి వారి క్షెమమునకే ఖర్చు పెట్టవలెను. వాయువు
అన్ని జీవ రాసులను సమానముగా ఆదరించునట్లు రాజు సర్వ ప్రజలను సమదృష్టితో
జూచి ఆదరించవలెను.

No comments:

Post a Comment