పనిలేదు. ఎవడెక్కువ
అన్యాయ వృత్తిలో నుండునో అంతగా పైకి వచ్చును. ఎదిరించి నిలబడు బలము లేనిచో పేద బ్రతుకులే మిగులును. ఎన్ని దారుణ కృత్యములు
చేసినను తన కున్నదానిలో
చాల కొంచెము దానము చేసినచో ధర్మాత్ముడ నిపించుకొనును . అతివృష్టి అనావృష్టి దోషములు తరచుగా సంభవించును. జీవనోపాధ
లేనివారు కాషాయములు
కట్టుకొని జగద్గురువులై ధనములు సంపాదించుచు, దొరికిన
స్త్రీలతో సంసార
సుఖములు గూడ అనుభవింతురు. ధనము ప్రధానమై రాజ్యమేలును. ధనము దొరుకునున్నచో దొంగ సాక్ష్యములు చెప్పుటకు సిద్దపడుదురు.
క్షుద్ర దేవతల నారాధించి
స్వల్పఫలములను గోరి దానితో తృప్తి పడుదురు. సగోత్ర జాతలైన స్త్రీలను వివాహ మాడుదురు. తద్దినములు పెట్టుట, చనిపోయిన వారికి కర్మ కాండలు చేయుట దండుగ అనుకొందరు. పంటలలో రాబడి తక్కువయగును.
సంతానములు వృద్ధి యగును.
దేహములు పొట్టి వైబలహీనములగును.
యజ్ఞయాగాదులు లేక పోవుటచే దేవతులు బ్రహ్మ దగ్గరకు బోయి మొర పెట్టుకొందురు. ఆయన వారిని శ్రీ మన్నారాయణుని దగ్గరకు తీసుకొనిపోయి వారి అవస్థలు విన్నవించును. దయామయుడైన శ్రీమహావిష్ణువు వారి లాలకించి వారి నోదార్చి యిట్లు అభయమిచ్చును. "దేవతలారా! నేను కలియుగములో అధర్మమును నాశనము చేసి ధర్మమును ప్రతిష్ఠించుటకై భూమిమీద అవతరించెదను. శంబళ అను పేరుగల గ్రామములో విష్ణుశర్మయను బ్రాహ్మణునికి సుమతియను భార్యయందు కలికి అను పేరుతో పుట్టెదను. అధర్మపరులైన మ్లేచ్చ రాజులను సంహరించి దేవాపి, మరుత్తు అనువారలకు రాజ్యాభిషేకము చేసెదను. అప్పటికి మీరును మీ అంశములతో పుట్టి నా పరివారముగా నుందురు". శ్రీహరి దేవతలకు చెప్పిన విధముగా విష్ణుశర్మ దంపతులకు కుమారుడుగా జన్మించెను. మహాత్ములయిన మునీంద్రులు వచ్చి ఆ బాలుని దీవించెదరు. ఉపనయనము చేయు వయసు రాగానే విష్ణుశర్మ ఆ బాలునికి ఉపనయనము చేయును. ఆ తరువాత కలికి పరశురాముని యెద్ద సకల వేదములు, వేదాంగములు, ధనుర్విద్య మున్నగు విద్యలన్నియు నేర్చికొనును. లక్ష్మీదేవి శ్రీహరిని విడిచియుండ జాలదు. కనుక సింహళ దేశములో పద్మావతిగా జన్మించును. ఆమెను కలికి వివాహమాడును. ధర్మ సంస్థాపనార్ధము శంకరుడాతనికి వాయువేగ మనో వేగములు గల అశ్వమును బహూకరించును. అతడా యశ్వము నెక్కి దుష్ట స్వభావము గల రాజుల నందరును తుద ముట్టించి ధర్మమును స్థాపించును. విశ్వకర్మ దివ్యమైన నగరమును నిర్మించి యిచ్చును. కలికి మూర్తి పద్మావతితో ఆ నగరమున నివసించుచుండగా, అతని తండ్రియైన విష్ణుశర్మ కుమారుని చూచుటకు వచ్చును. "తండ్రీ! నీవు అనుమతించినచో దుష్టులైన సకలరాజులను జయించి నీ చేత ఆశ్వమేధ యాగము చెయించెద" నని తండ్రికి చెప్పి అతని దీవెన లందుకొని విశాఖయూపుడను వానితో గలిసి బౌద్ద ధర్మావలంబులను, వేద ధర్మమును పాటించనివారిని జయించును. తరువాత జైనులు గూడ అటువంటి వారే అగుటచేత వారిని గూడ యుద్దములో ఓడించును. ఆ వెనుక మాయాదేవి అను నామెతో యుద్దము చేసి విజయుడై తిరిగి వచ్చును.
First 2 3 4 5 6 7 Last

No comments:
Post a Comment