సచ చిదానంద రూపాడ్యాం- జగన్మాత రమంబికామ్ 35
సౌందర్య సార సందోహాం- దదర్శ రఘు నందనః,
స్వస్వవాహన సంబద్దా - న్నానా యుధ లసత్కరాన్ 36
బృహద్రధం తరా దీని - సామాని పరి గాయతః ,
మరియు నక్కడే ఆనందముతో సుఖాసీనురాలై పూర్ణ చంద్రుని
వలె ముఖ బింబము గల నీలెంది పరమాలిక పగది గల ,
మరకత మణి కాంతిని విరజిమ్మునది, ఆణి ముత్యాల సరసములను
దాల్చినది యగుటచే కాంతియుత నక్షత్ర యుక్త మై
విరాజిల్లు రేయివలె నొప్పుచున్నది.
యగు శుంభ స్తనములుకలది , సన్నని నడుము గలది యు,
అమూల్య రత్నాలంకారముతో నొప్పునదియు ,
సుగంధ పూమాలికను దివ్య వస్త్రములను దాల్చినదియు
నల్లవ పువ్వులవలె నున్న గన్నులు కలది,
విడెముతో కూడినదియు, పతిదేవుని యాలింగనముతో
పులకాంకిత దేహము గలదియు సచ్చిదానంద శరీరము గలదియు
నిఖిల జగన్మాత యగు పార్వతిని గాంచెను.
స్వస్వ కాంతా సమాయుక్తా - న్దిక్పా లాన్పరి తస్త్సి తాన్ 37
అగ్రగం గుడా రూడం - శంఖ చక్ర గదాధరమ్,
కాలాం బుద ప్రతీ కాశం - విద్యుత్కాంత శ్రితాయుతమ్ 38
తరువాత తమ తమ వాహనా రూడులై సమస్తా యుధములను
ధరించి ,తమ తమ భార్యా సమేతులై నలువైపులా బూరించు
బృహద్ర ధంత రాది సామగానము చేయుచున్న
దిక్పాలకులను సందర్శించెను.
మరియు పరమ శివుని యెదుట శంఖ చక్ర గదా ఖడ్గములను
దాల్చి నీలి మేఘము కాంతి నొప్పుచున్న దేహము గలవాడై
మెరుపు తీగను బోలిన శ్రీదేవితో గూడి గరుడ వాహనము
నధిష్టింఛి యనన్య భక్తితో రుద్రాద్యాయమును పటించు
చున్న విష్ణువును కాంచెను.
జపంత మేక మనసా - రుద్రాద్యాయం జనార్ధనమ్,
పశ్చాచ్చతుర్ముఖం దేవం - బ్రహ్మాణం హంస వాహనమ్ 39
చాతుర్వక్తై శ్చతుర్వేద - రుద్ర సూక్తై ర్మ హేవ్వరమ్,
స్తువంతం భారతీ యుక్తం - దీర్ఘ కూర్చ జటాధరమ్ 40
పిమ్మట పరమ శివుని వెనుక భాగమున హంస వాహనము
నధిరోహించి, దనసతి యగు వాగ్దేవితోను, నాలుగు వేదములలోని
రుద్ర సూక్తములతో నీశ్వరుని స్తుతించు బ్రహ్మను చూచెను.
అధర్వ శిరసా దేవం - స్తువంతం ముని మండలమ్,
గంగాది తటి నీ యుక్త - మంబు ధిం నీల విగ్రహమ్ 41
No comments:
Post a Comment