Wednesday, February 5, 2014

శ్రీ కూర్మ పురాణము6






ప్రహ్రాదుడు

హిరణ్యాక్షుడు వరాహరూపుడైన శ్రీహరి చేతిలో మరణించిన తరువాత ప్రహ్రాదుడు సింహాసన మెక్కి రాజ్యపాలనము చేయుచుండెను. ఒకనాడొక మహర్షి ప్రహ్రాదునింటికి వచ్చెను . దేవతలు చేసిన మాయ వలన ప్రహ్రాదుని బుద్ది వక్రించి ,వచ్చిన బ్రాహ్మణుని అవమానించి పంపెను. అందుకు కోపించిన ఆ ముని నీకు గల వైష్ణవ భక్తి సర్వమును నశించు గాక యని శపించి పోయెను.
ఆనాటి నుండి ప్రహ్రాదుడు క్రూరమైన రాక్షస స్వభావముతో విష్ణు ద్వేషియై యజ్ఞ యాగములను బాడు చేయుచు ,మహర్షులను పీడించుచు, మానవులను సమయించుచు దురాగతములు ప్రారంబించెను . అంతేకాదు చతురంగ బలములతో స్వర్గపురి పై దండెత్తి దేవతలను ఓడించి అక్కడి నుండి తరిమి వేసి ఇంద్రుని సింహాసనము నాక్రమించి త్రిలోకములను పాలింపజొచ్చెను . పూర్వ రాక్షసుల పీడల కన్న ఈతని పీడ ఎక్కువై త్రిలోక వాసులు తల్ల డిల్లి పోవుచుండిరి . దేవతలును మునులును తమ భాధలను శ్రీ పతికి విన్నవించు కొనిరి .
అతడు దేవ సైన్యములతో ప్రహ్రాదుని మీదకు దండ యాత్ర చేసెను. ప్రహ్రాదుడు రాక్షస బలములు నన్నిటిని కూడ గట్టుకొని నారాయణుని ఎదిరించెను. వారిరువురుకిని మహా సంగ్రామము జరిగెను. చివరికి మాధవుని చేతిలో ప్రహ్రాదుడు ఓడిపోయెను. ఆ పరాజయముతో అతనికి కనువిప్పు కలిగి , విష్ణు శిక్ష చేత శాపము తొలగి ఆయనను శరణు వేడి ,తన యాపరాధమును మన్నింపు మని ప్రార్ధించెను. ఆనాటి నుండి మరల విష్ణు భక్తుడై శ్రీ నాధుని మన్నన లందుకొని , రాజ్య భోగముల మీద విరక్తి గలవాడై తన రాజ్యమునకు పిన తండ్రి కొడుకైన అందకుని పట్టాభి షిక్తుని చేసి ,తాను శ్రీ హరి చింతనములో మునిగి యుండి ,అవసరమైనపుడు మాత్రము అందకునికి కార్యా కార్యములు ఉపదేశించు చుండెడి వాడు.

First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last



No comments:

Post a Comment