Thursday, February 20, 2014

శివ గీత29




అధర్మే తు ప్రవృత్తాస్తే - దేవ బ్రాహ్మణ పీడనే,
తస్మా దాయు: క్షయం యాతం -తేషాం శ్రీ రపి సువ్రత ! 30
శివుడాదేశించు చున్నాడు: ఓయీ రామా! రావణుని వధించుట,
 మరియు రాక్షసులను పరిమార్చుటలోనీవెంత మాత్రము విచార పడకుము.
 రావణునికి చావు దగ్గరలో నున్నది, రాక్షసులు అధర్మ నిరతులై,
దేవతలు బ్రాహ్మణులను పీడించు చున్నారు. కావున వారి యాయువు
 ఐశ్వర్యములు తొలగి పోవనున్నవి.

రాజస్త్రీ లంఘ నాసక్తం -రావణం నిహ నిష్యసి,
పానా సక్తో రిపుర్జే తుం - సుకర సమరాం గణే. 31
అధర్మ నిరత శ్శత్రు - ర్భాగే నైవ హాయ్ లభ్యతే,
అధి తవేద శాస్త్రోపి - సదా ధర్మ రతో పినా 32
వినాశ కాలే సంప్రాప్తే - ధర్మ మార్గా చ్చ్యుతో భవేత్,
రాజు భార్యను లేవ నెత్తుకొని పోయిన రావణుని నీవు
యుద్ద భూమి యందు వధింప గలవు.
మధ్యము త్రాగిన వాడిని అనాయాసముగా జయింప వచ్చును కదా!
 అధర్మ నిరతుడగు శత్రువు తన యదృష్టము చేతనే లభించును .
బాగుగా వేదాగమ శాస్త్రముల నద్యయనము చేసిన వాడైతే నేమి,
ధర్మ మార్గామి యైతే నేమి, "వినాశకాలే విపరీత బుద్ది: "
అను సూక్తి మేరకు పోగాలము సమీపించి నప్పుడు
అధర్మ మార్గములో ప్రవర్తించును.

పీడ్యంతేదేవతా స్సర్వా - స్సతతం యేన పాపినా 33
బ్రాహ్మణా ఋషయశ్వైవ - తస్య నాశ స్స్వయం స్థితః,
కిష్కిందా నగరే రామ ! - దేవానా మంశ సంభవా: 34
వానరా బహవో జాతా - దుర్జయా బలవత్త రాః,
సాహయ్యంతే కరిష్యంతి - తైర్భ ధానా పయోనిధిమ్ 35
ఓ రామా! కిష్కిందా పురంబున అమరుల యంశము వలన
అనేకమంది వనచరులు ఉద్భవించియున్నారు.
వారందరు మిగుల శక్తి సంపన్నులై యితరులతో జయింపరాని వారై
సాగరమును బంధించి నీకవసరమైనం తగా సహాయ పడగలరు.

అనేక శైల సంబద్దె - సేతౌ యాంతు వలీ ముఖాః,
రావణం సగణం హత్వా - తా మానయ నిజ ప్రియామ్ 36
శస్త్రై ర్యుద్దే జయో యత్ర- తత్రాస్త్రాణి న యోజయేత్,



No comments:

Post a Comment