Thursday, February 13, 2014

శ్రీ బ్రహ్మాండ పురాణము16




రాముడు ,తిరిగి బ్రతికిన తండ్రిని జూచి నమస్కరించి ,తన ప్రతిజ్ఞను తెలియజేసెను .ఆయన ,"అపకారి యైనను ఉపకారము చేయుట బ్రాహ్మణ ధర్మమని ,తిరిగి కీడు జేయుట సరిగా "దనిభోధించెను . రాముడు తండ్రిని ఒప్పించ జూచెను.. ఆయన 'రామా ! నీవు బ్రహ్మ దగ్గరకు బోయి విషయమును వివరించి ,ఆయన చెప్పినట్లు చేయు " మని పంపెను.రాముడు బ్రహ్మ దగ్గరకు బోయి ,"మహాత్మా ! నేను ఏక వింశతి పర్యాయములు దండెత్తి క్షత్రియ సంహారము చేయుదునని ప్రతిజ్ఞ చేసితిని . అది నెరవేరునట్లు దీవింపుము " అనగా బ్రహ్మ ,"నాయనా ! నేను చాలా కష్టపడి సృష్టి చేసితిని ,నీవు దానిని సంహరించుటకు పూనినావు .ఇంక నేనేమి చెప్పగలను ? కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ప్రార్దింపుము . ఆయన నీకు తగిన ఉపదేశము చేయగలడు>"అని పంపివేసెను .రాముడు తిన్నగా కైలాసమున కేగి ,పార్వతీ సమేతుడైన యాతనిని స్తుతించి ,తన ప్రతిజ్ఞ విషయమును చెప్పి ఆ ప్రతిజ్ఞ నెరవేరు ఉపాయము సెలవి" మ్మని ప్రార్ధించెను . శివుడు "నాయనా ! నీవు నా కుమారుడైన కుమార స్వామితో సమానుడవు .నీ కోరిక నెరవేరును లెమ్ము. దేవతలకు గూడ పొంద శక్యము గాని త్రైలోక్య విజయ కవచమును , నారాయణా గ్నేయాది దివ్యాస్త్రములను ,గదాది సర్వాయుధములను
నీ కిచ్చెదను .సిద్ద సంకల్పుడవు కమ్ము " అని చెప్పి ,దివ్యాస్త్రములను ,ఆయుధములను ఇచ్చెను .తరువాత ," ఓం గోపీజన వల్లభాయ స్వాహా " అను విజయ సిద్ది మంత్రము నుపదేశించెను.దానికి సదాశివుడు ఋషి పంక్తి చ్చందము ,రాస (గాన ) రతుడు మాధవుడు దేవత .అఖిల కార్య దిగ్విజయ ము నందు వినియోగము అని దాని నియమములను చెప్పి ,శ్రీ కృష్ణ కవచము (ఆదే త్రైలోక్య విజయ కవచము ) ను ఉపదేశించెను , రాముడు పార్వతీ పరమేశ్వరులకు దండ ప్రణామములు చేసి పుష్కర తీర్ధమునకు బోయి పడి లక్షల సార్లు మంత్ర ,కవచ జపంబులు చేసి మంత్ర సిద్ధిని పొందుటకై ప్రయత్నించెను . ఒకనాడు ఒక నదికి , దాహము తీర్చుకొనుటకై వెళ్ళెను .అచటికి లేళ్ళ జంట యొకటి వచ్చెను . మగలేడి నీరు ద్రావి ,తన భార్యతో నిట్లనెను ."ఇదిగో ,ఈ గట్టుమీద కూర్చుండిన ఇతడు భార్గవ రాముడు .శివుని యొద్ద మంత్ర కవచములు నేర్చుకుని జపము చేసినాడు .కాని సిద్ది కలుగలేదు . అగస్త్యుని యొద్ద శ్రీ కృష్ణ ప్రేమామృత స్తోత్రమును ఉపదేశము పొంది దానిని పునశ్చరణము చేసినపుడే సిద్ది కలుగును. "ఆడలేడి " నీకీ త్రికాల జ్ఞాన మెట్లు కలిగె " నని యడుగగా మగలేడి ,"నేను పూర్వ జన్మములో విప్ర బాలకుడను .
వేద వేదాంగాములను జదివినాడను.ఒక పులి లేడిని జంపు చుండగా చూచి దానినే చింతించుచు కొండ మీది నుండి పడి మరణించితిని. అందుచేత నాకీ మృగ జన్మము వచ్చెను . ఈ మహా తపశ్శాలి యైన పరశురాముని చూడగానే నీకీ జ్ఞానము కలిగినది .ఈయన మహానుభావుడు "అని చెప్పుచుండగా పరశురాముడా మృగీ మృగ సంవాదము విని అగస్త్యా శ్రమమునకు బయలుదేరెను. ఈ లేళ్ళ జంట గూడా రాముని వెంట వెళ్ళెను. రాముడు అగస్త్యాశ్రమమునకు వెళ్లి ఆయనకు నమస్కరించి తనకు ఆ మంత్రమును ఉపదేశింపు మని యడిగెను .అగస్త్యుడా మంత్రము నతనికి ఉపదేశించెను. దీనిని సువర్ణ ముఖీ నదీ తీరమున గూర్చుండి పునశ్చరణము చేయు మనెను. రామునకు అగస్త్యుడు ఉపదేశించిన మంత్రమును
  First 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 Last

No comments:

Post a Comment