Friday, February 14, 2014

శివ గీత28




బ్రహ్మాపి బ్రహ్మ దండాస్త్ర - మాగ్నేయాస్త్రం ధనంజయః,
యామ్యం యమోపి మొహాస్త్రం - రక్షో రాజస్త ధాదదౌ .22
వరుణో వారుణం ప్రాదా - ద్వయ వ్యాస్త్రం ప్రభంజనః,
కౌబేరం చ కుబేరోపి - రౌద్ర మీశా న ఏవచ 23
సౌర మస్త్రం దదౌ సూర - స్సౌమ్యం సోమశ్చ పావకమ్,
విశ్వదేవా దదు స్తస్మై - వసనో వాసవాభిధమ్ 24
ఆ పరమ శివుని యాజ్నాను దల దాల్చి కరములు జోడించి
దేవతలు తమ తమ ఆయుధముల ప్రసాదించిరి.
వానిలో గోవిందుడు నారాయణాస్త్రమును, దేవేంద్రుడు ఆగ్నేయాస్త్రమును,
యమ ధర్మరాజు యామ్యాస్త్రమును,నైఋతి మోహాస్త్రమును,
 వరుణుడు వారుణాస్త్రమును, వాయువు వాయువ్యాస్త్రమును,
కుబేరుడు కౌబేరాస్త్రమును, శివుడు రౌద్రాస్త్రమును,
 సూర్యుడు సౌరాస్త్రమును, విశ్వదేవులు పావకాస్త్రమును,
వసువులు వాసవాస్త్రమును ఇచ్చిరి.

అధః తుష్టః ప్రణమ్యేశం - రామో దశరదాత్మజః,
ప్రాంజలి: ప్రణతోభూత్వా - భక్తి యుక్తో వ్యజిజ్ఞ పత్ . 25
పిమ్మట శ్రీ రాముడు సంతృప్తి చెంది శివునకు ప్రణమిల్లి చేతులు
జోడించి భక్తి మీర నిట్లు నివేదించు కొనెను.
భగవాన్! న్మాను షైరేవ - నోల్లంఘ్యో లవణాంబుధి:,
తత్ర లంకాభి ధం దుర్గం - దుర్జయం దేవదానవై: 26
అనేక కోట యస్తత్త్ర - రాక్షసా బలవత్తరా;,
సర్వే స్వాద్యాయ నిరతా -శ్శివ భక్తా జితేంద్రియా: 27
అనేక మాయా సంయుక్తా - బుద్ది మంతోగ్ని హొత్రిణః,
కధ మేకాకి నాజేయా - మయా భ్రాతాచ సంయుగే 28
ఓ పరమేశ్వరా! విశాలము మరియు అగాధమైన సాగరము
మానవులచేత దాటశఖ్యము కానిది పోగా లంకా నగరము
 ప్రవేశింప సాధ్య పడనిది.
అంతేకాదు, దేవదానవులకు కూడా సాధించ రానిది, అక్కడ మహాశాలురు,
స్వాద్యాయ నిరతులు, శివ భక్తులు (వీర శైవులు )
 ఇంద్రియ నిగ్రహము కలవారు మాయాసహితులు బుద్ధిమంతులు,
 అగ్ని హొత్రము కల (బ్రాహ్మణులు ) వారును, మరి ఎందరో సుతులు ఉన్నారు.
 కేవలము నా సోదరుడగు లక్ష్మణుని తో బాటు ఏకాకిగా నున్న నేను
మాత్రము రావణుని యెట్లు జయించ గలను?

రావణస్య వధే రామ ! - రక్ష సామపి మారణే ,
విచారో నత్వయా కార్య -స్తస్య కాలోయ మాగతః 29



First 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Last

No comments:

Post a Comment