అప్పుడు రాక్షసి విప్రునితన గుహకు దీసికొనిపోయి రాజ కుమార్తెను జూపి, "యది కాశి రాజు కూతురు రత్నావళి. దీనిని తండ్రి యొద్దకు చేర్చి వత్త"మని, తానొక ఆడు ఏనుగై వానిని ధనముతోను తన వీపుమీద నెక్కించుకొని కాశికి జేరెను. కన్యను రాజున కొప్పగించుటకు వారు వీవుమీద నెక్కిం చుకొని కాశికి జేరెను. కన్యకు రాజున కొప్పగించుటకు వారు రాజ భవనము నొద్దకు బోయిరి. అక్కడి రాజభటులకు జూచి రాకుమారి "నీ కూతురు క్షేమముగా వచ్చిన"దని రాజుతో చెప్పుడనెను. రాజు ఆ వార్త విని పరి వారముతో ఎదురు వచ్చి కూతురి నాదరించి, బ్రాహ్మణుని జూచి" అయ్యా, నా కుమార్తెను భద్రముగా దెచ్చి యిచ్చిన నీకు నమస్కారము. నీకే మిచ్చి ఋణము తీర్చుకొందును?" అనగా అతడు తన ప్రక్క, కన్యారూపములో నున్న రాక్షసిని చూపి" అంతయు ఈమె చలువ" అని చెప్పెను. అంతలో రాజకుమారి తండ్రిని జూచి "నాన్న! ఈ బ్రాహ్మణుడు ఉత్తముడు. ఈమె సహాయముతో నన్నెత్తు కొనిపోయిన రాక్షసుని జంపి రక్షించినాడు. ఈమె ఆ రాక్షసుని భార్య. నేనీ తనిని దప్ప ఇతరుని పెండ్లాడను" అని పలుకగా రాజు రాక్ష సకన్యను జూచి "తల్లీ! నీ భర్త దుర్మార్గమునకు రోసి, అతనిని వధించుటలో తోడ్పడిననీ సద్భుద్ద మోచ్చదగినది. ఈ బ్రాహ్మణుని వరంచినావు. అంతకంటె జన్మమునకు సార్ధక్యమేమున్నది? ఈ నా కుమార్తె కూడ ఇతనినే పెండ్లాడుదు ననుచున్నది. ఈమెను నీవు సవతిగా చూడక, దాసిగా ఏలుకొనుము. వీరి వివాహమునకు సమ్మతింపుము" అని ప్రార్ధింపగా రక్కసి కన్నియ ఆ పొగడ్తతలకు ఉబ్బిపోయి "మీరు నన్నింత మర్యాదతో పూజించు చుండగా లోకము గూడ నన్ను గౌరవించుచున్నది. ఇంతకంటె ఏమి కావలెను? నీ కుమార్తె యభి మతానుసారముగా పెండ్లి చేయ"మని ఆమోదించెను.
వివాహము మహా వైభవముగా జరిగెను. రాజు కూతురునకు అరణముగా అపారధనము లిచ్చెను. రక్కసి ఏనుగుగా మారి, బ్రాహ్మణుని, క్రొత్త పెండ్లి కూతురును అతని పూర్వగృహము ఉన్న చోటకి దెచ్చెను. దానిని తిరిగి కొని రాజ భవనమువలె అలంకరించినాడు విప్రుడు. ఇద్దరు భార్యతో సుఖముగా నుండుచు ప్రధమ భార్యను తీసికొని రండని భటులను బంపెను.
సుప్రియ, ఇద్దరు సవతలు వచ్చినందుకు విచారించుచుండగా తల్లిదండ్రులును బంధువులును గలిసి," ఇది వరకే పంతమునకు బోయి భర్తను విడిచి వచ్చితివి. అది దోషము. ఇప్పుడు అతడు ఆహ్వానించినను వెళ్ళకున్నచొ మహాదోషము. సతికి పతితక్క మరే మిధనము కావలెను? వెళ్ళి" రమ్మని బోధింపగా ఆమె పతియింటికి వచ్చెను. భర్త ఆమె నాదరించెను. కాని, సవతులను దెచ్చెనను ఒక నిరసనభావ మామె మనసులో నుండెను. అట్లే ఆమె జీవితమును గడిపి మృతినొందెను. తరువాత జన్మములో ఒక కీటకమై, పూర్వ స్మృతితో జన్మించెను. రుక్మాంగదుని భార్య సంధ్యావళి సుప్రియ చరిత్ర విని జాలిపడి, ఒక ఏకాదశినాడు ఉపవాసముండి శ్రీనాధుని పూజించిన పుణ్యము ధారపోయగా సుప్రియ కీటక రూపము విడిచి మోక్షమునొందెను.
No comments:
Post a Comment