Thursday, February 13, 2014

బ్రహ్మపురాణము8




క్రౌంచ ద్వీపము: క్రౌంచ ద్వీపము, కుశద్వీపము, కంటేరెట్టింపు వైశాల్యము ఉండును. దీనిచుట్టును ఘ్రుత (నేతి) సముద్రము ఉండును. కుశగము, రుందము, గోష్టము, పీవరము, అంధకారము, భూరిరూపము, దుందుభి, అను ఏడు వర్షములు అచట నుండును. క్రౌంచము, వామనము, అంధకారము, దేవవ్రతము, దమము, పుండరీక వంతము అను ఏడు కులపర్వతములు ఉండును. ఒక ద్వీపము, వర్ష పర్వతములు, సముద్రములు, ఆవల నిమ్కొక ద్వీపముగా ఈ ద్వీపములన్నియు భూమందలమున అమరియుండును. అచట దేవగణములు ప్రజలుగా నుందురు. గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి, పుండరీకము అను పేరులు గల నదులు ప్రవాహించుచుండును.

అచట జనార్ధనుడు, యోగ రుద్ర రూపుడై ఆరాధింపబడుచుండును.

శాక ద్వీపము: శాకద్వీపాదిపతికి ఏడుగురు పుత్రులుండిరి. వారి పేర్లు, జలదుడు, కుమారుడు, సుకుమారుడు, మనీరకుడు, కుసుమయోదుడు, మోదకి, మహాద్రుముడు, వీరి పేర్లతో ఆశాక ద్వీపమునందలి  వర్షములు ప్రఖ్యాతిపొందెను. ఏడు కులపర్వతములుండును. అవి, ఉదయగిరి, జలాధారము, రైవతకము, శ్యామము, దంభోగిరి, ఆస్తికోయము, కేసరి, అనునవి. శాకవృక్షములు (టేకుచేట్లు) అధికముగా నుండుటచేత దీనికి శాకద్వీపము అను పేరు గలిగెను. ఆచతగూడ నాలుగు వర్ణాలవారు ఉందురు. వారికి అలసత్వము (బద్ధకము) గాని, జడత్వము గాని ఉండదు. వ్యాదులుండవు. మంచి స్వభావముతో కాంతిగల దేహముతో అచటి ప్రజలు పరస్పర మైత్రితో ఉందురు. అక్కడ సమస్త పాపహరములును, పుణ్యప్రదములైన నుడులు ఏడు ఉన్నవి. అవి: సుకుమారి, కుమారి, నళిని, రేణుక, ఇక్షువు, దేనుక, గభస్తి, అనునవి. అచటి ప్రజలకు అధర్మము, దుఃఖము, అనారోగ్యము అన్ననేమో తెలియదు. వారు నిత్య సుఖ జీవనులై యుందురు. మగములు, మగధములు, మాసనములు, మందగములు అను నాల్గు వర్ణములుగా వారు ఉందురు.

పుష్కర ద్వీపము: పుష్కర ద్వీపము, శాకద్వీపము కంటే రెట్టింపు ప్రమాణము గలది. దీనికి అధిపతి సవనుడు. అతనికి మహావీతుడు, ధాతకి అను ఇద్దరు కొడుకులు గలరు. వారిద్దరి పెరులమీద రెండు వర్షములు వెలసినవి. అక్కడ మానసోత్తరమను మహాపర్వతము గలదు. అది, మహావేత, ధాతకీ వర్షములను రెండుగా విభజించుటకు బ్రహమదేవుడేర్పరచిన సరిహద్దువలె నుండును. అక్కడి ప్రజలు పదివేల వర్షములు జీవించెదరు. వారికి రోగములు ఉండవు. శోక ముండదు. రాగద్వేషములు ఉండవు. వీరు అధములు, వీరుఉత్తములు అను వర్గభేదములుఉండవు.  ఈర్ష్యా సూయలు, భయము, రోషము, లోభము, ఆ ప్రజలలో మచ్చికైనాను కనిపించవు. ఇచట సురలును, అసురులను, యక్షులును పరస్పర మైత్రితో మెలుగుచుండును. అసత్యముగాని, అనృతముగాని అచటలేవు. (అసత్యము = సత్యముకానిది పలుకుట, అనృతము = సత్యముకాని దానిని మనసునందు భావించుట).


Last   2  3  4  5  6  7  8  9  10  11    Last

No comments:

Post a Comment