Thursday, February 13, 2014

శ్రీ బ్రహ్మ వైవర్త పురాణము20





                                                   గణపతి ఖండము
గణే శుని యావిర్భావము
నారదుడు శ్రీమన్నారాయణుని జూచి " గణేశోత్పత్తి ప్రకారమును జెప్పు " మని యడుగగా నారాయణుడు చెప్పనారంభించెను అనుచు ,సూతుడు శౌనకాది మహర్షులకు గణపతి కధను చెప్పసాగెను .
సతీ దేవి తన తండ్రి యైన దక్షుడు చేసిన యవమానమును భరించ లేక యోగాగ్నిలో తన శరీరమును దగ్ధము చేసికొని ,పరమ శివునితో ఎడబాటు భరించలేక హిమవంతుని కుమార్తె పార్వతి గా జన్మించెను . మహా తపస్సు చేసి పరమేశ్వరుని యనుగ్రహము పొంది ,అతనిని భర్తగా పొందెను.
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము మహావైభవముగా జరిగినది . నూతన దంపతులు విహారార్ధమై బయలుదేరి నర్మదా నదీ తీరమున నిర్జనముగా నుండి భూత సంచారము లేని మహా వనమున శయ్య నేర్పరుచుకుని సహస్ర దివ్య వర్షములు లోకమునే మరచి పోయిరి . పార్వతీ పరమేశ్వరుల ఈ అపూర్వ సమాగమము దేవతలలో భయము పుట్టించెను. బ్రహ్మ విష్ణువుల కడ కేగి చెప్పుకొనిరి . వారు ,"మీ భయమునకు కారణము లేక పోలేదు. ఇప్పుడు శివ వీర్యము వలన పార్వతికి పుత్రుడు  పుట్టినచో వాడు సకల దేవ దానవులను గెలుచునంత మహా వీరుడగును .

అప్పుడు  వానిని పట్టలేము . కావున వారి సమాగమునకు విఘ్నము కలిగింపవలె " ననిరి .దేవతలు భయ పడుచునే దూరము నుండి శివుని స్తుతించు చున్నట్లు అరవ సాగిరి . ఇంద్రుడు ,చంద్రుడు, సూర్యుడు, ప్రత్యేకముగా "ఏమి చేయు చున్నావు శివా ! మమ్ము రక్షింపుము " అని అరచి పరుగున వెను దిరిగి పారిపోయిరి .

 First   16 17 18 19  20  21  22  23  24  25  26  27  28  29  30  31 Last

No comments:

Post a Comment