భక్తి నిరూపణ యోగము
సూత ఉవాచ
అధాత స్సం ప్రవక్ష్యామి - శుద్ధ కైవల్య ముక్తిదమ్,
అనుగ్రహాన్మ హేశస్య- భవ దుఃఖ స్య భేషజమ్ 1
శ్రీ శౌనకాది మహర్షుల గూర్చి సూతుం డిట్లు వాక్రుచ్చెను:
ఓయీ ముని పుంగవులారా! శ్రీ పరమాత్మ పరశివ మూర్తి యొక్క
అనుగ్రహము వలన, పరమ పునీతమగు, సంసార మనెడు ఔషధ
ప్రాయమైన బ్రహ్మ స్వరూప కైవల్యమును మోక్ష ప్రదమగు జ్ఞానమును
నేను మీకు బోధించు చున్నాను.
న కర్మణా మనుష్టానై - ర్న దానై స్వపపాసివా,
కైవల్యం లభతే మర్త్య ! - కింతు జ్ఞానేన కేవలమ్ .2
ఎటువంటి పుణ్య కర్మల ననుష్టిం చుట వలనను,
ఎలాంటి తపో నుష్టాన ముల జేయుట వలనను
కైవల్య పద ప్రాప్తిని పొందలేడు.
ఐతే కేవల మొక దివ్య జ్ఞానము వలన నే
కైవల్య ప్రాప్తి కలుగును .
రామాయ దండకారణ్యే - పార్వతీ పతినా పురా ,
యాప్రోక్తా శివ గీతాఖ్యా - గుహ్యా ద్గుహ్యాత మాపిసా 3
యస్యా శ్శ్రవణ మాత్రేణ - నృణాం ముక్తి ర్ద్రువా భవేత్,
పురా సనత్కుమారాయి - స్కందే నాభి హిఆ హి సా 4
పూర్వ కాలమున దండ కారణ్యములో శ్రీరామునకు శంకరుని
చేత ఏదైతే ప్రధమమున బోధించ బడినదో,
ఏదైతే పరమ గోప్యంబగు నదియు , దేనినీ ఆలించుట చేతనే
మానవులకు నిత్య (శాశ్వత) కైవల్యము లభించునో అట్టి
శివ గీతను సనత్కుమారునకు షణ్ముఖ స్వామి బోధించెను.
సనత్కుమార : ప్రోవాచ - వ్యాసాయ ఋషి సత్తమా ,
మహ్యం కృపాతి రేకేణ - ప్రదదౌ బాధ రాయణః 5
తరువాత నా సనత్కుమారుడు వ్యాసునకు బోధించిన వాడయ్యెను.
అట్టి వ్యాస మహర్షి నా యందు అనుగ్రహము కలవాడై
నాకు బోధించి యున్నాడు.
ఉక్తంచ తేన కస్మైచి - న్న దాతవ్య మిదం త్వయా ,
సూత పుత్రాన్య ధా దేవా! - క్షుభ్యంతి చ శపంతి. 6
No comments:
Post a Comment