" మనమందరమును ఆది పరబ్రహ్మము యొక్క సంకల్ప బలముచే నడచుచున్న వారము .స్వతంత్రులమై ఏమియును చేయజాలము .కావున ఆ పరబ్రహ్మమునే ప్రార్ధింతము ." అని చెప్పి ,నిశ్చల చిత్తముతో ఆ పరబ్రహ్మమును ఉపాసన చేయుచు ,"ఓ సత్య జ్ఞానా నంత స్వరూపుడైన పరమాత్మా ! నీవే పరబ్రహ్మ స్వరూపుడవు. నీ వలననే ఈ సృష్టి జరిగినది. బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మ కుడవు నీవే . నీవే సర్వ జగత్కారణమైన శక్తి స్వరూపుడవు .సృష్టి స్థితి లయములన్నియు నీ సంకల్పము వలననే జరుగుచున్నవి. సృష్టిలోని సకల చరాచర వస్తువులలోను అంశ మాత్రముగా నీవు వ్యాపించి యున్న వాడవు .ప్రపంచ వ్యవహారములు సాగుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృజించి ,వారికి కార్య నిర్వహణములో తోడ్పడుటకు రాజులను ,చక్రవర్తులను సృజించి , అవసరమైనపుడు దుష్టులను శిక్షించుటకు ,శిష్టులను రక్షించు టకు ను అవతారము లెత్తుచుందువు. ఓ భగవంతుడా ! మా ప్రార్ధనలను విని ,మా కష్టములు తొలగుటకు ఉపాయము చెప్పి మమ్ము రక్షింప జాలిన వాడవు నీవే "అని అనేక విధముల విన్న వించుకోగా ,పరబ్రహ్మము తేజో రూపమున బ్రహ్మాదుల ఎదుట సాక్షాత్కరించి ,"మీరు విచారింప వలదు .మీ కష్టములన్నియు త్వరలోనే తొలగి పోవును. "అని ఓదార్చి ,నారాయణుని జూచి, నీవు లక్ష్మితో గలసి భూమిలో అనేక నామములతో ,అనగా విష్ణు , నరసింహ ,భావనారాయణ ,జనార్ధన , కేశవ, జగన్నాధ ,గోపాల కృష్ణ ,రామచంద్ర ప్రముఖ నామములతో అవతరించి భూలోకములో నున్న ప్రజలచే పూజా పురస్కారములు పొందుచు దుష్టులైన వారిని శిక్షిం చుచు ,సజ్జనులైన వారిని రక్షించుచు ,సకల వర్ణములవారు ను వారి వారి వృత్తి ధర్మములను పాటించునట్లు చూచు చుండుము .పరమేశ్వరా ! నీవుకూడా పార్వతీ సహితముగా సుప్రసిద్దములైన తీర్ధ క్షేత్రముల యందు నివసించుచు భక్తుల కోరికలను దీర్చుచు ,వారి వారి కర్మ విశేషములను బట్టి ,సృష్టి ,స్థితి సంహారము లోనర్చు చుండుము . బ్రహ్మదేవా ! నీవు, మానవులు వేద శాస్త్రములు పటింఛి వానిలో జెప్పబడిన ధర్మములను ఆచరించు నట్లు చూచు చుండుము " అని చెప్పి అదృశ్య మయ్యెను.
శ్రీమన్నారాయణుడు బ్రహ్మాది దేవతలను జూచి ,"పరబ్రహ్మము చెప్పిన వాక్యములు మీరును విన్నారు గదా ! నేను భూలోకమునకు మహాలక్ష్మితో సహా వెళ్లి అనేకరూపములతోను, అనేక నామములతోను పూజల నందు కొనుచు రాజులను ,ప్రజలను , ధర్మములను , కాపాడు చుండెదను, ధర్మ హీనులైన వారిని శిక్షించు చుండెదను. "అని చెప్పెను . పరమేశ్వరుడు వారిని జూచి ," నేను జ్యోతిర్లింగ స్వరూపుడనై పండ్రెండు క్షేత్రములలో వెలసియుండి ,నన్ను జపార్చనా భిషేకములతో భక్తి శ్రద్దలు గలిగి సేవించిన వారికి రక్షణము నొసంగుచు ధర్మ రక్షణ చేయు చుందును. నా అర్ధాంగి యైన యీ పార్వతి అష్టాదశ పీటములందు జగన్మాతగా వెలసి ఆశ్రితులకు కల్ప వృక్షమై కోరిన కోరికలు దీర్చు చుండును. "అని చెప్పగా బ్రహ్మ ,"నేను సమస్త జీవ రాశులను సృష్టించు పనిలో తీరిక లేక యుందునను విషయము మీకు తెలిసినదే .అందుచేత నేను విగ్రహ రూపమున భూలోకమున నుండుటకు అవకాశము లేదు .కాని జీవులు చేయు పాప పుణ్య కర్మములను బట్టి వారికి ఆయ
No comments:
Post a Comment