ఇట్లుండ ఒకనాడు మాహిష్మతీ పురాధీశుడు కార్త వీర్యార్జునుడు వేటకై అడవికి వచ్చెను. జమదగ్ని ఆశ్రమమునకు రాగా ఆయన , కామధేనువును ప్రార్ధించి ,రాజునకును పరివారమునకును మృష్టాన్నములతో విందు చేసెను. సమస్త సౌకర్యములను కలుగ చేసెను. రాజు మరునాడు ఉదయమున ముని వద్ద సెలవు తీసుకుని తన నగరమునకు బోయెను. అతని మంత్రి చంద్ర గుప్తుడనువాడు రాజు నొద్దకు వచ్చి కామధేనువు ప్రసక్తి తెచ్చి "అది యున్నచో అన్నియు నున్నట్లే .దానిని సంపాదింపు "మని భోధించెను . రాజు ఆ మంత్రినే సామదాన భేదోపాయములచే దానిని తెమ్మని పంపెను . జమదగ్ని కామధేనువు నిచ్చుటకు నిరాకరించగా ఆ మంత్రియు ,బటులును గలిసి జమదగ్నిని జంపి ఆ ధేనువును దూడను గూడ అపహరించిరి .ఆ సమయమునకు రాముడు ఇంటలేడు. అతడు వచ్చుసరికి తల్లి ,తండ్రి శరీరము మీద పడి ఏడ్చు చుండెను. పరశురాముడు చూచు చుండగా ఆమె ఇరువది యొక్క సార్లు దండ యాత్రలు చేసి సంహరించెద నని ప్రతిజ్ఞ చేసెను. తల్లి యైన రేణుక సహగమనము చేసెదనని కొడుకులతో జెప్పి అందుకు సంసిద్దు రాలయ్యేను . ఇంతలో ఆకాశవాణి "సహగమనము చేయవలదు వేచి యుండుము . శుభములు గలుగు "నని చెప్పెను. బృగు మహర్షి అక్కడికి వచ్చి పరిస్థితిని జూచి తన మృత సంజీవనీ మంత్ర శక్తి చేత జమదగ్నిని తిరిగి బ్రతికించి ,అందరినీ దీవించి వెడలి పోయెను.
BhimasingiGiriAchary
- Sandhya
- HarsaPriya SivaMahadeva's Parivar
- Amruth Fabrication
- Ratnakar Hindu
- Vani Telugu
- Vinnu News
- Vissu-Images/Photos
- Panchangam
- Tour / Temples
- వాస్తు(Vastu)Devagiri
- Mahaniyulu
- Sastras
- My Near MahaKshetras
- Vedapatanam
- SatakaSahiti
- Odiya
- BharathaMaata-
- My Self
- Hindi
- Puranas
- నవ గ్రహాలు :
- Pujas Vratas
- birds /animals
- Flowers/Fruits
- Nada Yoga-Yoga
- Indian Law
- శకునాలు శాస్త్రములు
Wednesday, January 8, 2014
శ్రీ బ్రహ్మాండ పురాణము15
ఇట్లుండ ఒకనాడు మాహిష్మతీ పురాధీశుడు కార్త వీర్యార్జునుడు వేటకై అడవికి వచ్చెను. జమదగ్ని ఆశ్రమమునకు రాగా ఆయన , కామధేనువును ప్రార్ధించి ,రాజునకును పరివారమునకును మృష్టాన్నములతో విందు చేసెను. సమస్త సౌకర్యములను కలుగ చేసెను. రాజు మరునాడు ఉదయమున ముని వద్ద సెలవు తీసుకుని తన నగరమునకు బోయెను. అతని మంత్రి చంద్ర గుప్తుడనువాడు రాజు నొద్దకు వచ్చి కామధేనువు ప్రసక్తి తెచ్చి "అది యున్నచో అన్నియు నున్నట్లే .దానిని సంపాదింపు "మని భోధించెను . రాజు ఆ మంత్రినే సామదాన భేదోపాయములచే దానిని తెమ్మని పంపెను . జమదగ్ని కామధేనువు నిచ్చుటకు నిరాకరించగా ఆ మంత్రియు ,బటులును గలిసి జమదగ్నిని జంపి ఆ ధేనువును దూడను గూడ అపహరించిరి .ఆ సమయమునకు రాముడు ఇంటలేడు. అతడు వచ్చుసరికి తల్లి ,తండ్రి శరీరము మీద పడి ఏడ్చు చుండెను. పరశురాముడు చూచు చుండగా ఆమె ఇరువది యొక్క సార్లు దండ యాత్రలు చేసి సంహరించెద నని ప్రతిజ్ఞ చేసెను. తల్లి యైన రేణుక సహగమనము చేసెదనని కొడుకులతో జెప్పి అందుకు సంసిద్దు రాలయ్యేను . ఇంతలో ఆకాశవాణి "సహగమనము చేయవలదు వేచి యుండుము . శుభములు గలుగు "నని చెప్పెను. బృగు మహర్షి అక్కడికి వచ్చి పరిస్థితిని జూచి తన మృత సంజీవనీ మంత్ర శక్తి చేత జమదగ్నిని తిరిగి బ్రతికించి ,అందరినీ దీవించి వెడలి పోయెను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment