Thursday, January 9, 2014

శ్రీ కూర్మ పురాణము3




ఉమా శంకరుల ఉత్పత్తి
బ్రహ్మ దేవుడు తన మనస్సంకల్ప శక్తిచే మరీచ్యాదులను సృష్టించి వారితో సహా మరల తపము చేయుటకు పూనుకొనెను. అట్లు తపము చేయుచున్న బ్రహ్మ ముఖము నుండి ,ప్రళయ కాలాగ్ని సమానుడైన రుద్రుడు ప్రభవించెను. అతడు అర్ధనారీశ్వరుడుగా ,త్రిశూలమును చేత ధరించి మహా భయంకరుడై యుండెను. బ్రహ్మ అతనిని జూచి భయపడి ,"ఓయీ ! నీవు అటు పురుషుడవు కాక, ఇటు స్త్రీవి కాకుండా ఉన్నావు . కావున వేరు వేరు రూపములను ధరింపు "మని చెప్పి అంతర్దానము నొందెను.
రుద్రుడప్పుడు తన్ను తాను పదునొకండు పురుష రూపములు గాను (క పాలీశుడు మొదలగు వారు ) శాంకరి , వైష్ణవి , మున్నగు శక్తి రూపములు గాను విభజించు కొనెను. ఇందులో కొన్ని రౌద్రములు కొన్ని తెల్లనివి ,కొన్ని నల్లనివి ఇన్ని రూపములతో ఉమా మహేశ్వరుడు తానే లోకమంతటను వ్యాపించి యుండెను.



First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  Last


No comments:

Post a Comment