Friday, January 10, 2014

శివ గీత33




తప స్సత్యంచ పృధి నీ - చాప స్తేజో నిలోప్యహమ్,
ఆకాశో హం రవి స్సోమో - నక్షత్రాణి గ్రహాణ్యహమ్, 25
మరియును ఓయీ దేవతలారా! నేనే అతి ప్రాచీనుడిని ,నిత్యుడిని ,
 అనిత్యుడిని ,పాప రహితుడను, బ్రహ్మణ స్పతిని, పది దిక్కులును నేనే ,
సావిత్రీ - గాయత్రీ స్త్రీ పున్న పుంసకములు నేనే .
 త్రిష్టుప్ -జగతి- అనుష్టుప్ - పంక్తీ చందంబులు నేనే.
వేదమయుడను, ఆగసము, జగత్పతిని ,జ్యేష్టుడను,
సర్వేశ్వరుడు ,భగవంతుడు, ఈశ్వరుడు, తేజస్సు
ఇతిహాస పురాణాదులు, కల్పము, ఉపకల్పము,
కల్ప వంతుడు, విద్య, ఉపనిషత్తు శ్లోకము సూత్రము,
మంత్రము, వ్యాఖ్యానము, హతము, ఆహుతి, దాత,
 దానము, ఇహలోకము, పరలోకము, అక్షరము, క్షరము,
 సర్వ భూతములు , దాంతి, శాంతి, గుహ్యమును,నేనే.
సర్వతో ముఖుడను, అంతము మధ్యము, ద్వారము,
బహిస్థానము, ముందు, వెనుక నేనే .
మరియు నాశ రహితుడను. జ్యోతి స్వరూపుడను,
 తమము, ఇంద్రియములు, బుడ్డి, అహంకారము ,
విషయములు, త్రిమూర్తులు దిక్పాలురు, పార్వతీ ,
షణ్యుకుడు, గణపతి, పంచ భూతములు, సప్తలోకములు,
రవి ,చంద్రుడునక్షత్రములు,గ్రహములు, ప్రాణము ,
కాలము మృత్యువు, అమృతము ,భూతము, ఉన్నవి ,
కలుగబోవునవి,ఈ సర్వములు నేనే .

ప్రాణః కాల స్థథా మృత్యు - రమృతం భూత మప్యహమ్,
భవ్యం భవిష్య త్క్రు త్స్నం చ - విశ్వం సర్వాత్మ కోప్య హమ్     26
ఓమాదౌ చ తథా మధ్యే - భూర్భువస్స వస్త థైవ చ,
త తో హం విశ్వ రూపోస్మి - వీర్షం చ జపతాం సదా                 27
ఆశితం పాయితం చాహం - కృతం చాక్రుతం మప్యహ మ్
పరం చైవాపరం చాహ - మహం సూర్యః పరాయణః                28
మొట్టమొదట (ఆదిలో) ఓంకారముగాను,
 మధ్యలో భూ:- భువః:- సువర్లోకములు, అంతయును,
 విశ్వరూపుడను నేనే, జపించువారి ఫలితమును నేనే,
 తినబడినది, తాగబడినది, చేయబడినది, పరము, అపరము,
 సూర్యుడు, పరాయణుడు లోకహితము, దివ్యము, అక్షరము,
 సూక్ష్మము, ప్రాజాపత్యము, పవిత్రమును, సౌమ్యము, అగ్రాహ్యము,
 అగ్రియయును నేనే అయి యున్నాను.

అహం జగద్ది తందివ్య - మక్షరం సూక్ష్మ మప్యహమ్
ప్రాజాపత్యం పవిత్రం చ - సౌమ్యమగ్రాహ్య మగ్రియమ్         29
ఆహామేవో పసం హర్తా - మహాగ్రాసౌ జసాం నిధి:
హృదయే దేవతాత్వేన - ప్రాణత్వేన ప్రతిష్టితః                      30  

First  30 31 32 33 34 35 36 37 38 39  40 41   Last

No comments:

Post a Comment